Tuesday, January 18, 2022

శివోహం

శంభో!!! పొట్టని గుండె క్రింద ఏర్పాటు చేసి...
ఆ గుండె ఉండేది గుప్పెడే కానీ ...
ఆ గుండెకు నాలుగు గదులు చేశావు
(తల్లిదండ్రులు, ఆలుబిడ్డలు, బంధుమిత్రులు, శివకేశవులు)...
నేను కూటికి పేదవాడినే కాని నిన్ను పూజించుటలో కాదు...
నువ్వు నాకిచ్చినదే నీకు ఇస్తున్నానని చిన్నచూపు చూడకు...
నేను నీ వాడిని నీకు ఒంటికి సరిపడా భస్మం ఇస్తా కదా...

మహాదేవా శంభో శరణు...

Monday, January 17, 2022

శివోహం

పగలు రేయి రెండూ నీవే తండ్రి...
ఉదయాన నేపడే కష్టాలకు గొడుగువు నీవే...
నేను తినే అన్నపానాదులు నీభిక్షయే...
కడుపు నిండిన వేళ కనులు మూసుకుపోయి
సాయం చేసిన నిన్నే మరచి నిదరోతున్నా
నన్ను మన్నించు శంభో...

మూడుపూటల ముక్కంటివి నీవని ఎరుగక నేచేసిన తప్పిదాలు మన్నించి చీకటి వెలుగుల కాపాడవా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సృష్టి, స్థితి, లయాలకు...
మూల భూతుడైన ఆది దేవుడొక్కడే...
దేవదేవుడు శివుడొక్కడే....
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

సృష్టి, స్థితి, లయాలకు...
మూల భూతుడైన ఆది దేవుడొక్కడే...
దేవదేవుడు శివుడొక్కడే....
ఓం శివోహం...సర్వం శివమయం

Sunday, January 16, 2022

శివోహం

ఆనందం ,సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు...

నిజమైన ఆనందం స్నానంచేసి  ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది...

అరటాకులో  ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది...

ప్రశాంతవాతవరణంలో ఉన్నప్పుడు దోరుకుతుంది...

దైవ సన్నిదిలో ఉన్నప్పుడు దోరుకుతుంది...

ఒ మంచి పని చేసినప్పుడు దోరుకుతుంది...

దోరికిన వస్తువు తిరిగిఇచ్చినప్పుడు దోరుకుతుంది...

ఇతరులకు  ఒ చిన్న సహయం చేసినప్పుడు దోరుకుతుంది...

ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు దోరుకుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, January 15, 2022

శివోహం

శరణం అంటే మరణం లేదు...
అయ్యప్ప నామమే తారక మంత్రం....

స్వామియే శరణం అయ్యప్ప....
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, January 14, 2022

శివోహం

ఆశలు ఆశయాలు రెండు వైపులా గోడలు కాగా కోరికల మెట్లపై సాగిపోయే జీవితానికి లక్ష్యం ఏముంటుంది పరమేశ్వరా...
నా జీవన విధానానికి స్పష్టీకరణలు ఏమీ లేవు...
చేయి కాలిన వేళ గుర్తు వస్తున్నావు...
అన్నీ వదిలి నిన్ను చేరే కోరికే నా చివరి లక్ష్యం...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...