Saturday, January 29, 2022

శివోహం

శంభో...
నన్ను నీ దగ్గరకు రాకుండా అపగలిగావు సంతోషమే...
కానీ...
నిన్ను తలుచుకోకుండా ఎలా అపగలవు తండ్రి...
మహదేవా శంభో శరణు.

Friday, January 28, 2022

శివోహం

శంభో...
ఈ కదిలే బొమ్మ...
కట్టెలో కాలి...
నీకు భస్మం మై అభిషేకిస్తే అంతకంటే అదృష్టం ఎం ఉంటుంది...
మహదేవా శంభో శరణు.

Monday, January 24, 2022

శివోహం

మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఎంటో అర్థమవుతుంది...
గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించా లో తెలుస్తుంది....
నేనే, నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడివే మిగిలి పోవాల్సి వస్తుంది...
నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, గౌరవం పుచ్చుకోవాలి....
జీవితం అంటే అదే కదా.
 
ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, January 23, 2022

శివోహం

నేను నన్ను వీడితే కానీ...
నిన్ను నేను చేరుకోలేనా శివ...
నా వేదన పూజా సమయాన నీ ముంగిట నివేదించు వేళ...
మనలను విడదీయుట మాయ...
మానవ అవసరాలకు కదిలించి...
మనసును కలకలం చేసి వదిలి...
మనుగడకు వీధుల పాలు చేస్తుంది...
మరల మరుసటి రోజే నీకు నాకు బంధం కలుగుతుంది...
మనసు మనుగడకు బానిసై బ్రతుకుతెరువున నీకు దూరం చేస్తున్నది...
ఈ ఆకలి అవసరం తీరేదెన్నడు నిన్ను చేరేదెన్నడు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

శంభో...
గుండె కోరికల బరువుతో క్రుంగిపోయింది....
వాన చినుకులా కన్నుల నుండి...
కారి కారి కన్నీరు ఆవిరై....
కనులు ఎండి ఎర్రబారినవి...
నిన్ను ఎలా అభిషేకించను....

మహాదేవా శంభో శరణు...

Friday, January 21, 2022

శివోహం

నా నింగిలో నీడ నువ్వే...
నను నిలిపి ఉంచే నేల నువ్వే...
నను తడిపే వాన నువ్వే...
ముంచెత్తే వరద నువ్వే...
చీకటి నువ్వే.. 
వేకువ నువ్వే.. 
సంద్రం నువ్వే.. 
తీరం నువ్వే.. 
ప్రకృతి నువ్వే.. 
ప్రళయం నువ్వే...
ఆశ నువ్వే...
తుది శ్వాస నువ్వే హరా...
బతుకాట ఇక చాలు రా...
నీ పిలుపు కోసం కడపటి వాకిట కాచుక్కూచున్నా...
నీ నుంచే విడివడిన నే నీలోకే ప్రవహించేస్తున్నా...

మహాదేవా శంభో శరణు...

Thursday, January 20, 2022

శివోహం

శంభో....
ఏదో ఒకరోజు శుభ ముహూర్తన ఈ లోకము నన్ను విడిచి పెట్టున...
నీవు నన్ను విడువవు....
నాకు తోడునీడగా ఉండేది నీవే....
నువ్వే నాకు తల్లి, తండ్రి....
నాకు గురువు దేవుడు కూడా నీవే....
నీవే నాకు ప్రభువు నాకు దిక్కు నీవే....
నా సమస్తము నీవే నా సర్వం నీవే....

మహదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...