Thursday, February 3, 2022

శివోహం

బాట రాళ్లు రప్పలతో కూడి ఉన్నట్టే...
జీవితమంటే ఎత్తుపల్లాలే అని అర్ధం చేసుకున్న  శ్రమ జీవులకు తలపై మోతలు గుండెల్లో బరువు ఒక లెక్కా నా శివ....

అందుకే కాసింత కష్టం ఇవ్వు నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సమస్త జీవులకు హితాన్ని శుభాన్ని చేకూర్చే తల్లి...
భక్తుల హృదయాల్లో ప్రాపంచిక భావాలు తొలగించి వారికి శుభాలను ప్రసాదించే మాత...

అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే.

ఓం శ్రీ జగన్మాత యై నమః.
ఓం శ్రీమాత్రే నమః.

Wednesday, February 2, 2022

శివోహం

శంభో
నా అంతరంగపు ఊసులు అన్నీ ...
నీకే చెప్పుకుంటూంటాను ...

నువ్వు వింటున్నావో లేదోమరి ...
చెడుగాలి నా చుట్టూ ఆవరించివుంది ...

ఉబుసుపోక చెప్పుకునే మాటలకు మల్లే ...
నా అంతరంగాన్ని గాలికొదిలేయకు సుమా ....

నీ ముంగిట విచ్చుకున్న పూవు లా ఊపిరి విడవాలనుంది ...

మహాదేవా శంభో శరణు...
ఓం నమో నారాయణ.

Tuesday, February 1, 2022

శివోహం

నిన్ను కొలిచేవాడికి...
సంపదలపై మోజుకన్నా...
నిను చూసి తరించాలనే కోరిక కలుగుతుంది...
నిత్య సంపదలకన్నా శాశ్వత సంపదలు...
ప్రధానమని తెలుసుకొనేలా చేస్తావు...
నీదారిలో నడిచేవాడికి తోడూనీడా నీవే కదా శివా...

మహాదేవా శంభో శరణు...
ఓం నమో నారాయణ.

Monday, January 31, 2022

శివోహం

కాలుతున్న ఇంటినుండి...
మునిగిపోతున్న పడవనుండి...
బయట పడటానికి ఎంత ఆత్రం చూపిస్తామో...
ఈ సంసారమనే సుఖదుఃఖ వలయంనుండి బయట పడటానికి భగవన్నామాన్ని గమ్యంగా చేసుకుని ఆత్రంగా సత్య నిష్టతో నమ్మకంతో నిరంతర సాధన చేయాలి...
అంత ఆయనే(పరమాత్మ) చూసుకుంటుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
ఎన్ని జన్మలెత్తానో...
ఎన్ని బంధాలిచ్చావో...
అసలు తరుగేలేదు...
సినిమా రీలులా కదలిపోతున్నాను....
తలచుకుంటే భయం వేస్తుంది....
మనసుతో చెప్తున్నాను
నిన్ను చేరాలని ఎక్కడా ఆగవద్దని ప్రయాణం చేసున్నా ఎన్నాళ్ను చేయాలో నిన్ను చేరాలంటే...

మహదేవా శంభో శరణు.

Sunday, January 30, 2022

శివోహం

ఈ సర్వసృష్టీ ఈశ్వరమయం....
సర్వత్రా నిండి నిబిడికృతమై వున్న పరమాత్మ సర్వజ్ఞుడు...
సర్వ వ్యాపకుడు...
సర్వ శక్తిమంతుడు...
సర్వేశ్వరుడే...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...