Wednesday, February 9, 2022

శివోహం

శంభో...
మౌనమనే నా మనసు గదుల్లో...
మనసు పడే ఈ వేదన వెనుక...
మింగలేని మా బాధలు ఎన్నో దాగి ఉన్న ఆ దుఃఖం తో..
ఓ నీరు తీయగా...
మరోటి ఉప్పగా...
రెండుకలిపి నా గుండె మరలో కలిసిపోయి...
నానోట పలికే నమః శివాయ నామంతో శుద్ధి అయి... నీ శిరమున పడి పానవట్టమునకు చేరుసరికి అమృతమే అగును కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నిన్నొక్క సారి చూడాలని ఉంది తండ్రి...
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది...
భక్తితోడ నీ కృపను  పొందాలని ఉంది...
నాలో నిను దర్శిస్తూ ఆనందించాలని ఉంది...
నీ కరుణామృత వర్ష ధారనెలా తడిచి తరించేది...
నీ చరణకమలాల ముందు నా హృదయాన్ని ఎలా పరచేది...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

బ్రహ్మ కడిగిన పాదము...
బ్రహ్మము తానెని పాదము...
చెలగి వసుధ కొలిచిన నీ పాదము ..
బలి తల మోపిన పాదము...
శరణు అన్న వారిని రక్షించే నారాయణుడి పుణ్యపాదం...

ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ..

Tuesday, February 8, 2022

అయ్యప్ప

హరిహారపుత్ర అయ్యప్ప...
కలి మాయలో ఉన్న మాకు...
కలిలో నీవే కనిపించు దైవము నీవు...
పిలిస్తే పలికే దేవదేవుడవు నీవు...
కలి మాయ నుండి రక్షించే భారం నీదే కదా మణికంఠ...

అయ్యప్ప మా దేవా నీవే శరణు.

శివోహం

శంభో...
ఉయ్యాల కి ఊరేగింపు కి మధ్యలో ఎన్ని బంధాలో...
ఈ ఊపిరి పోసినవాడు ఎవరు రేపు ఊపిరి తీసేవాడు అనే ఎరుక లెకుండా ఊపిరి సలపని బంధాలలో బందీ చేస్తావు...
నీవు గొప్ప మాయగాడివి సుమీ...
నీ మాయ ముందు మేము ఎంతటి వాళ్ళము...
ఈ మాయ నుంచి బయటకు వచ్చేలా అనుగ్రహించు...

మహదేవా శంభో శరణు.
ఓం నమో నారాయణ.

శివోహం

సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం... సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడు...
ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కొలిచే ఏకైక దేవుడు, అందరి దైవం సూర్యభగవానుడు...
ఈ సృష్టిలోని అన్ని ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించే త్రిమూర్తి స్వరూపుడయిన సూర్యభగవానుడు జన్మదినం రథసప్తమి శుభాకాంక్షలు ఆత్మీయులకు.

Monday, February 7, 2022

శివోహం

నిశ్శబ్దంగా ఉండడమంటే తాను దైవంతో ఉండడం...
మౌనంగా ఉండడమంటే తానే దైవంగా ఉండడం...
మొదటిది వాకేమౌనం...
రెండవది మనోమౌనం...

ఓం శివోహం... సర్వం శివమయం

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...