Monday, February 21, 2022

శివోహం

జననం నీవే...
గమనం నీవే...
సృష్టివి నీవే...
కర్తవు నీవే...
కర్మవు నీవే...
ఈ జగమంత నీవే తల్లి....
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివశక్తి స్వరూపం పట్టుకుంటే అది మనకు కావలసిన సమస్తం ఇవ్వగలదు...
దానికి ఆ శక్తి  వుంది...
పరమాత్మను పట్టుకునే వాడి కోరికలు పరమాత్మే తీరుస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, February 20, 2022

శివోహం

మనసు మానవుడికి భగవంతుడిచ్చిన భిక్ష...
దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే...
మనసును మందిరం చేసుకుని, మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి...
అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే అంతర్యామి కోవెలగా మారిపోతుంది.

ఓం శివోహం... సర్వం శివయమం.
ఓం నమో నారాయణ.

శివోహం

శివుణ్ణి నమ్ముకో మిత్రమా...
నీ భారాన్ని పరిపూర్ణ విశ్వాసం తో శివుడి పై నమ్మకం ఉంచితే నిన్ను తప్పక ఏ ఆపద నుండి అయిన రక్షిస్తాడు...
గరళం ను కంఠం లో దాచి సృష్టి ని కాపాడి రక్షిస్తునా వాడికి నీ బాధలు ఒక్క లెక్కనా ఏంటి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 18, 2022

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మనసు మలినాలతో ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

గతంలో స్వగతంలో ఉన్నది నీవే...
భవిష్యత్తులో ఉండేది నీవే...
అసలు నీవు...
నకలు నేను...
కానీ నిన్ను నమ్మిన నాకు ఈ చిక్కుల లెక్కలేనయ్యా శివ...
చిక్కులు తొలగించు...
దారి వైపు మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

Thursday, February 17, 2022

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.