Wednesday, March 2, 2022

శివోహం

శంభో...
వేదిక నీదే...
రచన దర్శకత్వం అన్నీ నీవే...
నేను ప్రేక్షకుడను మాత్రమే..
పాత్రలన్నీ నీవే...
నిత్యం నీ భిన్నరూప దర్శనమే మాకు మహద్భాగ్యం...
నీతో ఉంటే నీలీలలన్నీ చూసే భాగ్యం కలుగుతుంది

మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!నీ విభూదిగా వచ్చింది ఈ దేహం
నీకు విభూది కావాలి ఈ దేహం
నీది నీవే గ్రహించు నన్ను అనుగ్రహించు.
మహేశా . . . . . శరణు .

Tuesday, March 1, 2022

శివోహం

శివ పార్వతుల పెండ్లి రోజు

కోరిన వరాలిచ్చే భోళా శంకరుడిగా...
కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే
ప్రళయ రుద్రునిగా...
ప్రపంచాన్ని మింగేసే కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న
నీలకంఠుడిగా, ఈ శునిగా, సర్వేశునిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో...
ఎన్నో పేర్లతో.. భక్తుల కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు పార్వతి దేవిని పెండ్లాడింది ఈ రోజే. లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈరోజే అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజుని మహాశివరాత్రిగా ఊరూవాడా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ అర్థ నారీశ్వరుల ప్రేమ కథని, శివ లింగ ఆవిర్భావ కథని మరొక్కసారి గుర్తుచేసుకుందాం.
ఇవుడు మామూలు బట్ట కట్టడు.పామునే
ఆభరణంగా ధరిస్తాడు. శ్మశానమే అతని నివాసం. పార్వతి దేవి హిమవంత రాజు కూతురు. అప్టైశ్వర్యాల్లో పుట్టి పెరిగింది. ప్రపంచంలోనే అందరి కన్నా అందగత్తె. ఇలా ఏ విషయంలోనూ శివ. పార్వతులు సమానం కాదు. కానీ, వాళ్ల ప్రేమ కథ లోకానికే ఆదర్శం అయింది. ఆ అర్థనారీశ్వరులు
ప్రేమకే నిర్వచనం అయ్యారు. వీళ్లిద్దరి బంధం జన్మ జన్మలది. పార్వతి దేవి మొదట దక్ష ప్రజాపతి కూతురు సతిగా పుడుతుంది. పుట్టుకతోనే శ్రీమంతురాలైన ఆమె శివుడ్ని అమితంగా
ప్రేమిస్తుంది. మనసా, వాచా ఆరాధిస్తుంది. ఎన్నో కష్టాల్ని అధిగమించి శివుడ్ని పెండ్లాడుతుంది కూడా. కానీ, శ్మశానమే ఇల్లుగా చేసుకున్న శివుడ్నిసతి
పెండ్లాడటం నచ్చదు దక్షుడికి. దాంతో సతి ముందే శివుడ్ని అవమానిస్తాడు. అది భరించలేని సతి తన శరీరాన్ని, లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది. మళ్లీ శివుడ్ని చేరుకోవడానికి
హిమవంతుడి కూతురు పార్వతిగా జన్మిస్తుంది. ఈ జన్మలోనూ ఇద్దరూ ఆస్తిపాస్తులు, అందం.. ఇలా ఎందులోనూ ఒకటిగా లేరు. అయినా సరే శివుడి మనసు నచ్చి తల్లిదండ్రుల్ని ఒప్పించి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది పార్వతి. అది మెచ్చిన శివుడు మహా శివరాత్రి రోజే పార్వతీదేవిని
పెండ్లాడతాడు. అందుకే ఈ రోజు ప్రతి శివాలయంలో శివ పార్వతులకి ఘనంగా పెండ్లి చేస్తారు. మరో కథ
 
శివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజే అని శివపురాణం చెప్తోంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప? అన్న వాదన
మొదలైందట. వాళ్ల గర్వాన్ని పోగొట్టడానికి శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడట. ఆ లింగం ఆది, అంతం తెలుసుకోగలిగిన వాళ్లే గొప్పవాళ్లని బ్రహ్మ, విష్ణువులకి చెప్తాడట శివుడు. అప్పడు ఆ లింగం మూలస్థానం చూసేందుకు విష్ణువు వరాహరూపంలో పైకి, అంతిమస్థానం చూసేందుకు బ్రహ్మ. హంసరూపంలో కిందివైపుకి ప్రయాణించారు.
కానీ, ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుడి గొప్పదనాన్ని తెలుసుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది. అందుకే అది మహాశివరాత్రి పర్వదినమైందని చెప్తారు.

Monday, February 28, 2022

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది...
అరిషడ్వర్గపు ఆటలలో లోబడి.....
రోగియైన నా మనసు కల్లుతాగిన కోతిలా....
అటాడుతూ చిందేస్తుంది...
నీవే నాకు కొండంత అండగా ఉండి...
నన్ను కాపాడగారావా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!మూడు కన్నుల నిన్ను తెలియగాను
వేయి కన్నుల నిన్ను వెతుకుతున్నాను
వెలుగువో జిలుగువో  నాకు తేట పరచు
మహేశా . . . . . శరణు .

Saturday, February 26, 2022

శివోహం

చిన్ని చిన్ని తప్పిదాల్ని భరించలేనప్పుడు జీవితంలో పెద్ద విజయాల్ని సాధించలేం మిత్రమా...

చివరికంటూ మనవెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం...

మన భావాలు మరొకరికి భారం కాకూడదు, బాధని కల్గించకూడదు...

ఓం గం గణపతియే నమః.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఎంగిలి కాని రీతి ఎలుగెత్తి పిలిచాను
ఎదురుగా నిను చూడ ఎదలోకి చూసాను
ఎదలోన ఏముందో కానరాకుంది
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...