Monday, March 7, 2022

శివోహం

మనసా...
ఓ మాయదారి మనసా మాయన పడకే...
తస్మాత్ జాగ్రత్త  అరిషడ్వార్గాలనే  దొంగలు ఆరుగురు చొరబడతారు...
జ్ఞానమనే రత్నాన్ని దోచుకుపోతారు...
మరువకు మరవకు ఓ మనసా మీ శివ గురుపాద మంత్ర స్మరణ చేయవే ఓ మనసా....

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, March 6, 2022

శివోహం

భగవంతుడు సర్వవ్యాపి...
కొందరు ఏమనుకుంటారు దేవలయంలోనే దేవుడు ఉన్నాడని భ్రమ పడుతుంటారు...
గుడికి వెళ్ళాలి నిజమే ఎందుకు వెళ్ళాలి చిత్త శుద్ధి కోసం...
మనసు చిత్తం శుద్ధి అయిన తర్వాత అంతటా భగవంతుణ్ణి చూడాలి...
ఎదగాలి ఒక స్థాయి నుండి ఉత్తమ స్థాయికి లేకపోతె ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది...
బయట వెతకడం కాదు అంతర్ముఖత చెంది పరమాత్మని లోపల వెతకాలి...
అప్పుడే నీలో  అసలైన భక్తి మొదలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!కర్మ ఫలమున కాయమొచ్చెను.   
కర్మ చేయుటకు అది సాయమొచ్చేను 
కాయము కాలనీ కర్మలన్నీ మాయనీ
మహేశా . . . . . శరణు.

శివోహం

దేహమే దేవాలయం...
దేహంలోని తెలివే జీవుడు...
దేహంలోని జీవుడే దేవుడు...
దేహంలోని ఆత్మయే పరమాత్మ స్వరూపం...                            *ఓం నమః శివాయ*

శివోహం

భగవంతుడు లేని చోటు ఎక్కడ?
సకల సృష్టి, సమస్త చరాచరం అంతయూ ఆ సర్వాంతర్యామియే.
సర్వులయందు, సమస్తము నందు సర్వవ్యాపకుడు.
అంతయూ భగవత్ స్వరూపమే......
ఇక భగవంతుడు లేనిది ఎక్కడ????

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, March 5, 2022

శివోహం

శివా!కన్ను మించి కనిపించే నిను మించి ఏముంది...?
అనుభూతులకు మించే అనుభవం ఏముంది 
అదే నాకు కలిగించు అలా నాకు కనిపించు.   మహేశా . . . . . శరణు

శివోహం


ఈ సృష్టిలో మనము మొదలు కాదు చివర కాదు...
ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము... అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు...

ఓం శివోహం...సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...