Wednesday, March 16, 2022

శివోహం

జీతమిచ్చే యజమాని దగ్గర ఎంత భయ భక్తులతో ఉంటామో...
అలాగే గురువు దైవం దగ్గర కూడా  ఉంటె బాగుపడతాము...
భయం నుండి దైవం పుట్టింది...
భక్తి నుండి దైవత్వం పుట్టింది...
భయం భక్తులను మించిన స్థితియే ముక్తి.

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నీలకంఠ తేజం దేహమంత విరియగా
నుదిటి కన్ను శోభించెను తిరునామంగా
విస్తరించె నీ రూపం విష్ణువుగా
మహేశా ..... శరణు.

శివోహం

కంటి మంట దొరా నీవు...
నా గుండె మంటలార్పవా...
శివ నీ దయ తండ్రి.

Tuesday, March 15, 2022

శివోహం

జీవితం క్షణ భంగురం...
కాలం బలీయమైనది...
విధి నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యసాధ్యం...
మాయ ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలీదు...
జనన మరణ చక్ర భ్రమణము నుండి మోక్షం  ఎప్పుడు కలుగుతుందో తెలీదు...
పుట్టినప్పటి నుండి మృత్యువు వెంటాడుతూ ఉంది..
అప్పటిదాకా పరమాత్మ ను శరణు వేడుదాం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే చూస్తున్నాము ఇద్దరం
మహేశా . . . . . శరణు .

Monday, March 14, 2022

శివోహం

శివా!దేహంపై మాకు వ్యామోహం 
దానికి మేము  దాసోహం
"దా" తొలగించు "సోహం"నెరిగించు
మహేశా . . . . . శరణు.

శివోహం

నేను కోరకుండానే నువ్వు నాకిచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు: ఆకాశమూ, కాంతీ, నా ఈ దేహమూ, జీవితమూ, మనస్సు

వీటికి నన్ను అర్హుణ్ణి చేసి 
అత్యాశలవల్ల కలిగే ఆపదలనించి రక్షిస్తున్నావు

నా జయాపజయాలనించి బహుమానంగా 
నేను సంపాయించిన హారాలతో 
నిన్ను అలంకరిస్తాను దేవా...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...