మనిషి జీవితం దుఃఖమయం
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.
ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు
బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని దుఃఖిస్తాడు.
బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని దుఃఖిస్తాడు.
తల్లి పాల కోసం ఆకలితో దుఃఖిస్తాడు
శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.
బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు
నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.
యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.
ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.
ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.
పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.
భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.
పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.
వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.
ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.