Thursday, April 14, 2022

శివోహం

శివా!చేరువలో నీవని చెప్పుకున్నా గానీ
నీ చెంతకేలనో చేరలేకున్నాము
చేరనీయవయ్యా చేరువకావయ్యా
మహేశా . . . . శరణు .

శివోహం

నిన్ను చూడగలిగే జ్ఞాన నేత్రం ఉండాలే కానీ...
లోకాలన్నిటిలో నీవే నిలిచి ఉన్నావు సర్వేశ్వరా...
నిన్ను చూచే ఆ జ్ఞాననేత్రం ను నాకు ప్రసాదించు తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Wednesday, April 13, 2022

శివోహం

శంభో...
నీ నామ స్మరణ చేయకపోతే...
నా మనసు అలసిపోతుంది పరమేశ్వరా...
రోజు ఇదే తంతు...
దయతో నన్ను కరుణించి దర్శనం ఈయవా శంకరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

భక్తి వలన ప్రయోజనం భగవంతుని అనుగ్రహం పొందడం...
భగవదనుగ్రహం వలన జనన మరణ రహితమైన ముక్తి కలగడం...
పరమశాంతి, శాశ్వతానందం అనె పరాభక్తి సిద్ధించడం...
సంసార దుఃఖం నుండి బంధం నుండి విముక్తి చెందదం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, April 12, 2022

శివోహం

శంభో...
మీదైన ఈ ఆటలో ఆడీ ఆడీ అలసిపోయిన దాసుడను నేను...
ఈ దాసుని ఆలనాపాలనా నా యజమాని గా భాధ్యతై నీదే శివ...
నీ పాదములను ఆశ్రయించిన ఈ దాసుని జీవితము రాబోవు ఆ అద్భుతము కోసం వేచి ఉన్నది ప్రభూ... 

మహాదేవా శంభో శరణు.

Monday, April 11, 2022

శివోహం

నాదో వింత ప్రపంచం...
నాకేమో అది అద్భుతం...
చూసేవాళ్లకేమో పిచ్చి ప్రపంచం...
నాకు నచ్చిందిగా అంతే...
నేను మెచ్చింది ఇంతే శివ...
ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా శంభో....

మహాదేవా శంభో శరణు.

Sunday, April 10, 2022

శివోహం

శంభో!!!ఈ మాయామోహ జగత్తులో...
సంసారం అనే సముద్రంలో వివశులై...
దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు...
మానవజన్మ ఉద్దరణకు కావలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని నువ్వే కలుగజేయాలి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...