Saturday, April 30, 2022

శివోహం

కఠినం పఠనం జటిలం స్మరణం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం జఠరశయనం జటిలం జరాశయనం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం దివ్యనయనం జటిలం అంతిమపయనం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం వచనం జటిలం నిర్వచనం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం శ్లోకం జటిలం లోకం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం రాగం జటిలం తాలం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం నమకం జటిలం చమకం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం దైవం జటిలం భూతం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం జీవనయాత్ర జటిలం అంతిమయాత్ర
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

కఠినం జననం జటిలం మరణం
తస్మాత్ జపే వారం వారం శివ చరణం

Friday, April 29, 2022

శివోహం

అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి...
ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశల పాశాలను తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం...
వైరాగ్యం పదునైన కత్తి ఒక్కటే...
శివ నామ స్మరణ...

ఓం శివోహం... సర్వ శివమయం.

Thursday, April 28, 2022

శివోహం

దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ... ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి,పరీక్షించుకోవాలి,పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి...

ఓం శివోహం.. సర్వం శివమయం

శివోహం

శివ శక్తి...  
శివుడే శక్తి...
చూసేవారికి రెండు
తెలుసుకున్న వారికి ఒకటి..
ఓం నమఃశివాయ శివాయై నమః
ఒకటే మంత్రం రెండుగా అనిపిస్తుంది

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, April 27, 2022

శివోహం

శంభో...
ఎన్నిసార్లు మీ ముందర మోకరిల్లినా ఇచ్చిన ఋణం తీరిపోవునా...
ఎన్నిసార్లు చక్కని పూలతో అలంకరణ చేసినా చల్లని మీ చూపుల స్పర్శకు సాటిరాగలదా శివ...
విధిగా ఆలయ పరిసరాలు శుభ్రం చేసినా మీ సన్నిధిలో పొందిన మనశ్శాంతి మరెక్కడైనా దొరుకునా...
ఏది చేసిన,  ఏమి ఇచ్చినా అవన్నీ నీవు ఇచ్చిన భిక్షయే ప్రభూ....

మహాదేవా శంభో శరణు.

శివోహం

నా బాధలన్నిటికీ మూలకారణం నా స్వభావమే కానీ ఇతరుల స్వభావం కాదని తెలుసుకోవడానికి నేను చాలా కాలం తపస్సు చేయవలసివచ్చింది...

ఇక అందరినీ పవిత్రమైన మనస్సుతో ప్రేమించడానికి ఇంకెంత కాలం తపస్సు చేయవలసివస్తుందో...

మహాదేవా నీ దయ.

శివోహం

మనసు విరిగితేనే అహము పోయేది...
అహము పోతేనే అజ్ఞానం పోయేది...
అజ్ఞానం పోతేనే ఆత్మజ్ఞానం వెలిగేది...
ఆత్మజ్ఞానం వెలిగితేనే భ్రాంతి పోయేది...
భ్రాంతి పోతేనే బ్రహ్మము దరిచేరేది...
బ్రహ్మము దరిచేరితేనే బట్ట బయలయ్యేది...
బట్ట బయలైతేనే కదా బయటపడేది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...