Tuesday, May 17, 2022

శివోహం

శివ..
దైవానుగ్రహమున్నచో యితర రక్షణలు లేకున్నను జీవించును...
దేవుని దయ లేకపోతే యెంత సురక్షిత ప్రదేశమందు వున్నను ప్రాణి నశించును అడవిలో దిక్కులేకుండా  
పారవైచిన వాడు బ్రతికి బాగుంటున్నాడు... గృహమున సురక్షితముగ నున్నవాడు  యెంత
ప్రయత్నించిననూ దక్కకుండా పోతున్నాడు కదా! దీనికి కారణము నీ అనుగ్రమే కధ శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

జీవన రహదారిలో తప్పటడుగుల పసిపాపను నేనైతే నా చేయి పట్టి నడిపిస్తున్న తండ్రివి నీవు...

ఒడిదుడుకుల రక్కసిని చూసి భీతిల్లుతున్న పసిబిడ్డను నేనైతే నను అక్కున చేర్చుకుని లాలిస్తున్న తల్లివి నీవు...

జీవన గమ్యం చేరలేక చిన్నాభిన్నమై ఉన్నది నేనైతే మార్గదర్శకమై నను నడిపిస్తున్న గురువువి నీవు...

కన్నీటి అగాధంలో దిక్కుతోచక దైన్యమై నిలిచింది నేనైతే చేయూత నిచ్చి నను పైకి లాగుతున్న నేస్తం నీవు...

నిన్నే మది నమ్మి సర్వశ్య శరణాగతి అంటున్నది నేనైతే సర్వదా నను రక్షించి కాపాడుతున్న దైవం నీవు

మహాదేవా శంభో శరణు.

Monday, May 16, 2022

శివోహం

ఎవరిని అంటే ఎవరు ఊరుకుంటారు తండ్రి...
నాగోడు నీకుగాక ఇంకెవరికి చెప్పుకోవాలి...
సంతోషాలు ఇచ్చేది నీవే కాదనను...
కానీ కష్టాలు కూడా నీవే ఇస్తున్నావు...
మరిమరి ఇస్తున్నావు నిన్ను ప్రతిక్షణం తలిచేతట్టు చేస్తున్నవు...
సుఖపడిన రోజులు మరచి బాధలలో నిన్ను నిందిస్తున్నాను నన్ను మన్నించు శివా...

మహాదేవా శంభో శరణు...

Sunday, May 15, 2022

శివోహం

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు.... భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు....
దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు...
ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు నా శివుడు...

ఓం శివోహం...సర్వం శివమయం

Saturday, May 14, 2022

శివోహం

కర్మ ఫలితాన్ని ఎవరూ కూడా నశింపజేయలేరు... భగవంతుడు కూడా కర్మఫలితాన్ని తొలగించలేడు... ఆయనకు ఆ శక్తి లేక కాదు, మనకి తగిన అర్హత లేక! కానీ ఎన్ని కష్టనష్టాలు ఎదురైననూ తనను మరువకు, విడువక శరణాగతులై ఉన్నవారి కర్మ ఫలాన్ని మాత్రం కుదించగలడు. ఈ కుదింపు కూడా వారి వారి సాధనపై ఆదారిపడి ఉంటుంది. తనను శరణు అన్నవారికి ఒక కుక్క కాటు వలన కలిగే బాధను చిన్న చీమ కాటుతో సరిపెడతాడు. కత్తి పోటు వలన కలిగే నొప్పిని కాలి ముల్లుతో సరిపెడతాడు. విశ్వసించాలి. అద్భుతాలను చూపిస్తాడు...
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

నీ హృదయం కరిగే వరకు...
నా హృదయ స్పందన నీకు వినపడేంతవరకు వరకు...
నిన్ను ప్రార్థిస్తూనే ఉంటా...
నీ చెంత చేరుటకు...

మహాదేవా శంభో శరణు...

Friday, May 13, 2022

శివోహం

మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసులోని ఖాళీని అర్థం చేసుకున్నప్పుడే వర్తమానంలో మార్పును అంగీకరించ గలుగుతాం. జరుగుతున్న విషయంలోనే మార్పు ఉంటుంది కానీ జరిగిపోయిన వాటిలో ఇక ఈ మార్పు ఉండదు. ఎందుకంటే అది అప్పటికే మారిపోయి ఉంది. మనసులోని ఆ ఖాళీతనం తెలియటమే ధ్యానం ! ఈ ఖాళీతనం తెలియాలంటే అసలు మనసు అంటే ఏమిటో ముందు తెలియాలి. మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసు బయటి విషయాలు గమనించటంతో పాటు వాటిని తనలో జ్ఞాపకంగా దాచుకోగలదు. బయట ఉన్న విషయాలను, లోపలి జ్ఞాపకాలను అది ఒకేసారి గ్రహించగలదు. లోపలవున్న జ్ఞాపకంలాగా బయటి ప్రపంచం ఉండాలనుకుంటే అది సాధ్యంకాదు. ఆ భావనే మనకున్న సహజ ధ్యానస్థితిని భంగపరుస్తుంది !

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...