Wednesday, May 25, 2022

శివోహం

జగత్ దృష్టి తొలిగితే తానెవరో తెలుస్తుంది...
తానెవరో తెలిస్తే జగత్ దృష్టి తొలగుతుంది...
ఎటు నుంచైనా మొదలు పెట్టు...
మనస్సును తుదముట్టించు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

దేహమను క్షేత్రంలో -
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు; 
ప్రేమ అను జలాభిషేకమును; 
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను; 
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత! 
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

Tuesday, May 24, 2022

శివోహం

బాధ లేని మనిషి కానరాడు...
బాధ పడేవాడు ఎన్నడూ బాగుపడడు...
బాధ లేకుంటే వాడసలు మనిషి కాడు...
బాధ పెట్టుట మాకు నీ పరీక్ష కాదా శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

ఆది నువ్వే...
అంతం నువ్వే..
జననం నువ్వే...
మరణమూ నువ్వే...
నా ఆత్మలో కొలువుదీరిన
ఆ పరమాత్మవూ నువ్వే...
నా దైవం నువ్వే....
నా ధ్యానం నువ్వే...
నా ప్రపంచమూ నువ్వే...
నా సమస్తమూ నువ్వే...
ఈ జీవన పయనంలో అడుగడునా నాకు నువ్వే పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Monday, May 23, 2022

శివోహం

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావాల్సిన చైతన్యశక్తి...
అంటే శ్వాసతో కలిసిన చైతన్యం ప్రాణం....
పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశవిధ ప్రాణాలు లేదా వాయువులని చెప్తుంటారు.... ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంతమై, తద్వారా హృదయ కమలం వికసిస్తుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

స్నేహము చేసుకొనుట సులభము కాదు...
కానీ దానిని భరించుట చాలా కష్టము...
కారణము మనసే...
ఈ మనసు కోతి వంటిది...
ఈ క్షణము ఈ కొమ్మ మీదయితే మరుక్షణము ఇంకొక కొమ్మ మీద...
ఎన్ని చెట్లు చుట్టుకొస్తుందో తనకే తెలియదు...
కావున మనసు మీద మనకు పట్టు వుండవలెను...
స్నేహితము చేయుటకు వ్యక్తీ యోగ్యత పరిశీలించడము అత్యవసరము...
స్నేహము చేసిన తరువాత మాత్రము దానిని ఎట్టి పరిస్థితిలోనూ కాపాడుకొనవలసినదే కానీ చిన్న చిన్న పోరపొచ్చాలతో దూరము కాకూడదు. మనసును నియంత్రించుకొనుట మనిషికి మిక్కిలి అవసరము.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, May 22, 2022

శివోహం

ఎద్దు వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎట్టాగ తిరిగావు శివ...
ఎట్టాగ కుదిరేను నీకు...
మాకు ఎరుక కాకున్నాది...
ఏమేమి చూసావో...
నీవు ఏమేమి చేసావో కానీ...
ఏడ చూసిన నీవే...
ఏమి చేసిన నీవే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...