Tuesday, May 31, 2022

శివోహం

నిజాయితీగా లొంగిపోవడం అనేది...
జ్ఞానోదయానికి అసలు రహస్యం...
తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా...
తనను తాను శ్రీరామ చంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు...
నిజాయితీగా ఆ తన దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది...

జై శ్రీరామ్. జై జై హనుమాన్

శివోహం

మాయ నిన్ను మళ్ళీ మళ్ళీ కప్పుకోకుండా ఉండాలంటే గురువులతో సజ్జనులతో సాంగత్యం ఉండాలి...
నీకు వేరే దారి లేదు మిత్రమా.

ఓం నమః శివాయ.

శివోహం

నా దగ్గర ఏమి లేవు నీకు ఇవ్వడనికి...
శూన్య హస్తాలు తప్ప...
నమక చమక సోత్రాలు రాదు...
నీ నామ స్మరణ తప్ప...

శివా నీ దయా తండ్రి...

Monday, May 30, 2022

శివోహం

శివ...
నాతో ఆడుకోవాటినికి నీనుండి నన్ను దూరం చేసి కలియుగంలో పంపి దాగుడుమూతలాడుతున్నావు...

పోనీ నీ పాదాలు దొరికినవి కదా అని సంబరపడుతుంటే
అందాల ఆశ చూపి , సంపదలు చూపించి , బందం తో బందీని చేసి ఇక్కడ కూడా దూరమే చేస్తున్నావు...
ఎన్ని జన్మలైనవో ఈఆట మొదలుపెట్టి...
ముగుంపు నీయరా పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మనస్సు నిర్మలమైన కొద్ది దాన్నినిగ్రహించడం సులభమవుతుంది...
మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సాద్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్ధంగా కార్యాన్ని నిర్వహించవచ్చు.

ఓం శివోహం...సర్వం శివమయం.                                             

Sunday, May 29, 2022

శివోహం

నీవు ఉన్నవని వాస్తవమే
దేవుడు ఉన్నాడు అనడానికి తిరుగులేని సాక్ష్యం.

ఓం నమః శివాయ.

శివోహం

ఇష్టమైన సోమవారం..
పైగా అమావాస్య...
చెప్పయండి మరి...
ఓం నమః శివాయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...