Thursday, June 2, 2022

శివోహం

తనువులో ముళ్ళు...
మనసులో కుళ్ళు...
ఎంగిలాకు బతుకుళ్ళు...
ఉండేది కల్ముషలోగిళ్ళు...
రోగాలతో వళ్ళు...
మరణశయ్యపై చేరేవాళ్ళు మేము...
మా మీద ని ప్రతాపం ఏంటి ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, June 1, 2022

శివోహం

నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు...
వద్దు అనుకుంటే ఇమడకు చిరునవ్వు తో నొప్పించక తప్పించు...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో...
ఎన్నో పనులు చేయడానికి సమయం, ఓపిక,డబ్బు,తపన ఉంటాయి...
కానీ 24 గంటల్లో నిన్ను తలిచే ఓపిక గాని తీరిక గాని సమయం గాని ఉండడం లేదు...
తండ్రీ ఏమిటీ మాయ, ఎందుకీ లీల,ఈ పరీక్ష,ఈ జగన్నాటకం,ఈ తోలుబొమ్మలాట...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నువ్వు నీ సొంత కాళ్లపై నిలబడి ఉన్న కొంచెం ఇతరులను గౌరవించడం నేర్చుకో మిత్రమా ఎందుకంటే మరణించిన తరువాత నీ సొంత కాళ్లతో స్మశానం కు చెరుకోలేవు కదా...

ఓం నమః శివాయ

శివోహం

ఆత్మ శుద్ధి లేకుండా శరీరాన్ని ఒక్కటే శుద్ధి చేసుకొని గుడికి వెళ్లి భగవంతుడా నన్ను కాపాడు అని ప్రయోజనం లేదు...

ఓం నమః శివాయ.

శివోహం

కోపం రావడం మానవ సహజం అయితే కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత...

ఓం నమః శివాయ

Tuesday, May 31, 2022

శివోహం

ఉరకల పరుగుల ప్రపంచంలొ...
గమ్యం తెలియని ప్రయాణంలొ నా కాళ్లు పరుగెడుతున్నాయి.
పరుగాపితే ప్రయాణం ముగిసిపొతుందనే భయం... పయనం ఎటువైపో తెలియకపోయినా పరుగె అలవాటైపోయింది...
ఈ పరుగుపందెంలొ నా నీడ కూడా నాకు ఎదురు నిలవకూడదు అనే కసితొ పరుగెడుతున్నా....

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...