Friday, June 10, 2022

శివోహం

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ
రామ సీతాపతి
రామ నీవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి
శ్రీరామ శరణు శరణు.

శివోహం

మాయ గురించి ఆలోచన కలగడమే మాయ...
మాయ నీడ లాంటిది. విడదీయడం చాల కష్టం...
మాయ ఒక బ్రమ లాంటిది మన పూర్వ జన్మ వాసనల వల్ల ఇది రక రకాల రూపాలలో వస్తుంది...
వాసనల వల్ల వ్యసనాలు ఏర్పడుతాయి మరియు మంచి బుద్ధి కూడా కలుగుతుంది...
సుధీర్గ విచారణ వల్ల మాయను తొలగించుకోవచ్చు...
ధర్మము నుంచి అధర్మము వైపునకు లాగేది మాయ. కాబట్టి ధర్మమును గట్టిగ పట్టుకొంటే మాయనుంచి బయట పడతాము...
బుద్ధి చెప్పేది ధర్మము మనసు చెప్పేది మాయ...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

ఆశించడం మన చేతిలో ఉంటుంది...
అందుకుంటామో , వదులుకుంటామో తలరాతే నిర్ణయిస్తుంది...

ఓం నమః శివాయ.

శివోహం

అనాయాసేన మరణం...
వినా దైన్యేన జీవనం...
దేహాంతే తవ సాన్నిధ్యం...
దేహిమే పరమేశ్వరా...

Thursday, June 9, 2022

శివోహం

అమ్మలగన్న అమ్మే  సర్వప్రాణి కోటికి మూలం ఆధారం...
అన్నింటినీ సృష్టించిన తల్లి ఆదిపరాశక్తి ఐనా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

కారణం లేకుండా ఏది జరగదు...
ఆ కారణం మనకు తెలియదు...

ఓం నమః శివాయ

Sunday, June 5, 2022

శివోహం

మనిషి శిలలా మారడానికి కారణం ఓ గాయం కావచ్చు...

అలంటి గాయం తగిలితేనే కదా శిలా కి జీవం వస్తుంది...

గాయం నైశిని బాధ కలిగించవచ్చు కానీ ఆ గాయాలే మనిషికి జీవించడానికి నేర్పుతాయి...

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...