Sunday, June 12, 2022

శివోహం

సదా శివుడు నీవు...
సదా తోడుగా ఉంటావని నిన్నే నమ్ముతున్నాను పరమేశ్వరా...
అన్యమేరగని నాకు అన్ని నీవే ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Saturday, June 11, 2022

శివోహం

అజ్ఞానమనే చీకటికి నీ నామ స్మరణ ను చిరుదీపముగ వెలిగించి...
నీరూపము కొరకు వెదుకుచుండగ...
దారితప్పిన వేళ చేయూతనిచ్చి నన్ను నీవైపు నడిపించు...
ఎంత చీకటిలోనైనా(కష్టంలో)నిన్ను వదలను...
మణికంఠ దేవా నీవే నా దీపానివి...
నా ఆరాధనయే నీకు దీపారాధన...

మహాదేవా శంభో శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివారాధనకు
ఐశ్వర్య
ఆడంబరం
అక్కర లేదు...
శివుణ్ణి తలవాలి అనే మంచి మనసు ఉంటే చాలు...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, June 10, 2022

శివోహం

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ
రామ సీతాపతి
రామ నీవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి
శ్రీరామ శరణు శరణు.

శివోహం

మాయ గురించి ఆలోచన కలగడమే మాయ...
మాయ నీడ లాంటిది. విడదీయడం చాల కష్టం...
మాయ ఒక బ్రమ లాంటిది మన పూర్వ జన్మ వాసనల వల్ల ఇది రక రకాల రూపాలలో వస్తుంది...
వాసనల వల్ల వ్యసనాలు ఏర్పడుతాయి మరియు మంచి బుద్ధి కూడా కలుగుతుంది...
సుధీర్గ విచారణ వల్ల మాయను తొలగించుకోవచ్చు...
ధర్మము నుంచి అధర్మము వైపునకు లాగేది మాయ. కాబట్టి ధర్మమును గట్టిగ పట్టుకొంటే మాయనుంచి బయట పడతాము...
బుద్ధి చెప్పేది ధర్మము మనసు చెప్పేది మాయ...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

ఆశించడం మన చేతిలో ఉంటుంది...
అందుకుంటామో , వదులుకుంటామో తలరాతే నిర్ణయిస్తుంది...

ఓం నమః శివాయ.

శివోహం

అనాయాసేన మరణం...
వినా దైన్యేన జీవనం...
దేహాంతే తవ సాన్నిధ్యం...
దేహిమే పరమేశ్వరా...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...