Tuesday, June 14, 2022

శివోహం

శివ స్వరూపం పట్టుకుంటే అది మనకు కావలసిన సమస్తం ఇవ్వగలదు...
దానికి ఆ శక్తి  వుంది...
పరమాత్మను పట్టుకునే వాడి కోరికలు పరమాత్మే తీరుస్తాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 13, 2022

శివోహం

మదిలో కలవరం కనిపించే లోకం పోకడ...
యదలో అలజడి కదిలే కాలం తీరు...
నీ ఆటలో పావును కదా
బందాల బందీకానలో బందించి , ఆశల పాశాలలో శోదించి ...
మనసును మరీ రాటుదేలుస్తున్నావు మహాదేవా...
మరో అధ్యాయానికి తెర తీస్తున్నావు...
ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే శివ...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో మహాదేవా
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా శరణు.

Sunday, June 12, 2022

శివోహం

See Good
Say Good
Do Good
ఈ మూడూ చాలు పరమేశ్వరా
మనసా వాచా కర్మణా నిన్ను అనుసరించే దారి చూపించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

సదా శివుడు నీవు...
సదా తోడుగా ఉంటావని నిన్నే నమ్ముతున్నాను పరమేశ్వరా...
అన్యమేరగని నాకు అన్ని నీవే ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు.

Saturday, June 11, 2022

శివోహం

అజ్ఞానమనే చీకటికి నీ నామ స్మరణ ను చిరుదీపముగ వెలిగించి...
నీరూపము కొరకు వెదుకుచుండగ...
దారితప్పిన వేళ చేయూతనిచ్చి నన్ను నీవైపు నడిపించు...
ఎంత చీకటిలోనైనా(కష్టంలో)నిన్ను వదలను...
మణికంఠ దేవా నీవే నా దీపానివి...
నా ఆరాధనయే నీకు దీపారాధన...

మహాదేవా శంభో శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివారాధనకు
ఐశ్వర్య
ఆడంబరం
అక్కర లేదు...
శివుణ్ణి తలవాలి అనే మంచి మనసు ఉంటే చాలు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.