Sunday, June 19, 2022

శివోహం

ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Saturday, June 18, 2022

శివోహం

దేవుడికి మరో పేరుంది..
నేనైతే నాన్న అని పిలుస్తా...
Happy Father's day Nanna.

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ దయే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

Friday, June 17, 2022

శివోహం

శంభో...
నువ్వు మాత్రమే నా అండ ఉండగలవు...
నిశ్చలమైన పరిస్థితుల్లో నువ్వు మాత్రమే నాకు తోడుగా నిలువగలవు...
అన్యమేరగని నాకు నువ్వు తప్ప నన్ను ఆదరించే వారెవరులేరు...
నీవు ఉన్నవనే నమ్మకం, ఏదోక రూపంలో నువ్వు వస్తావనే దైర్యం ఇవే నన్ను ముందుకు నడిపిస్తుంది...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నా ప్రాణ వాయువు...
నీ నామస్మరణే మహాదేవా...

మహాదేవా శంభో శరణు...

Thursday, June 16, 2022

శివోహం

తలచిన వెంటనే పలికేవాడా...
అమ్మా అన్నపూర్ణమ్మా అని బిక్షకు వెల్లినవాడా...
నీల కంఠుడా....
విశాల హ్రుదుయుడా...
నంది వాహనుడా...
కాశీ విశ్వనాధుడా...
శివ శివా అంటే చలి అయినా ఉరుకునే...
హరహరా అంటే అర్తితో వస్తివే...
రావేంది నాతలపులలోకు 
ఎల్లప్పుడు రావేంది ...
అసలు రావేంది....
నేను నిజం అయితే నాలోని నీవు నిజమే కదా
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

బాల్యం ఆటలమాయం....
యవ్వనం ప్రలోబలమాయం....
ముసలితనం వ్యాధులమాయం....
ఇంకా ఈ జన్మకి నీ తత్వాన్ని....
తెలుసుకొనేది మార్గ ఎక్కడ శివా....

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...