Tuesday, June 21, 2022

శివోహం

శంభో...
ఇకచాలయ్యా...
చాలాకాలం ఆడాను ఈ పాత్రోచిత ధర్మాలు...
ఈ ఆట ఎంతోకాలం ఆడాను...
ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను...
నాకంటవు ఇక నేను నీ దరికి వస్తా...
నేను ఎదిగాను...
పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు...
నాకు పాత్రోచిత ధర్మాలు లేవు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మానవ పుర్రె ఓక కోరికల గంప దీని నింప గలవారు ఈ భూమి మీద లెడు...
ఈ కోరిక తీరింది అనుకోవడమే కొత్త కోరిక కు పునాది....
కోరికలకు అది లేదు అంతం కన్నా లేదు...
కాబట్టి కోరిక దుఃఖం కు మూలం...
ఎన్ని కొరికలో ఎన్ని దుఃఖలో...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 20, 2022

శివోహం

మానవుని దేహానికి శివం అని పేరు.
శివం అనగా మంగళకరం అని మరో అర్థం. సదాలోచనలు, సచ్చింతనలతో దేహాన్ని శివంగా మార్చుకోవాలే తప్ప దుర్భావాలు,దుశ్చింతనలతో దానిని శవంగా మార్చుకోకూడదు.
దేహనికి సార్థకతను చేకూర్చే కర్మలనే చేయాలి. అపుడే భగవంతుని అనుగ్రహం పుస్కలంగా పొందవీలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

పుట్టినప్పుడు ఏది తీసుకొని రావు...
పోయేటప్పుడు ఏది వెంట తీసుకొని పోవు...
జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య అది తెలుసుకోవడమే అసలైన విద్య...
బతుకు భ్రాంతి చెంది బతుకంతా భ్రష్టు పట్టకుండా జ్ఞానాన్ని ఆర్జించి భ్రాంతి రహితమై బ్రహ్మము దరిచే రాలి...
అదే అసలైన జ్ఞానం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, June 19, 2022

శివోహం

ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Saturday, June 18, 2022

శివోహం

దేవుడికి మరో పేరుంది..
నేనైతే నాన్న అని పిలుస్తా...
Happy Father's day Nanna.

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ దయే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...