Tuesday, June 28, 2022

శివోహం

జీవుడికి మరణం జననం లాంటివి ఉండవు...
పాత బట్టలు తొలగిస్తూ కొత్త బట్టలు ధరిస్తు
మరో జన్మ మరో తలిదండ్రులు మరో బంధనాలు
ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటాడు...
ఆది అంతు లేని  ప్రయాణం
గమ్యం తెలియని జీవనం
ఈ జీవుడి అనంతమైన యాత్ర
ఈ జీవాత్మ ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే ఎంత కాలమో కదా ఈ దేహ ధారణము

ఓం శివోహం... సర్వం శివమయం
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

Monday, June 27, 2022

శివోహం

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి.
ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం.
ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం.
ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

శంభో..

కళ్ళలో మెదిలే రూపం నీవు ..
కమ్మటి కలల్లోకి వచ్చెడి దివ్య రూపం నీవు ..

కనుల లోలోతుల్లోకి వచ్చి కలవరపెడుతుంటే ..
కనిపించేదంతా మాయగా అనిపిస్తోంది తండ్రీ ..

ఇక కనుకు పట్టేదెలా ముక్కంటీశా ...
ఇక మౌనం నాకు అలవడేదెలా ..

నా ... ఆశ... శ్వాస ... ధ్యాస ... నీవే..

మహాదేవా శంభో శరణు.

Sunday, June 26, 2022

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు
తెలియక చేసిన పాపాలు ఎన్నో  !....
గాడి తప్పిన మతిని అనుసరించి
మనిషి చేసిన నేరాలు ఎన్నో  !..........

అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా 
ఎంత కాలం మోస్తుంది  ?
దూరాలు దుర్భరాలు 
కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు  ?...

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నాము  ....

ఓం శివోహం.... సర్వం శివమయం.

శివోహం

భక్తే ప్రేమ...
ప్రేమే భక్తి...
ప్రేమే ఆరాధన...
ప్రేమే దైవం...
ప్రేమే పరమాత్ముని స్వరూపం...
ప్రేమే ఈశ్వరీయగుణం...
ప్రతి ఒక్కరి అంతఃచేతనల్లో వున్న అంతరాత్మే ప్రేమస్వరూపుడైన దైవం...
నా అనేవారికే పరిమితం చేయకుండా అందరిలోవున్న ఆత్మే ప్రేమస్వరూపుడైన భగవంతుడని గ్రహించి, దయార్ధమైన ఆలోచనలూ, మాటలు, చేతలతో అందరితో ప్రేమగా ఉంటే పరమాత్మను పొందగలం...
భగవంతుని ప్రేమను పొందాలంటే మనలో ప్రేమతత్వమును పరిపూర్ణంగా పెపొందించుకోవాలి. సర్వదా, సర్వత్రా ప్రేమతో, సంయమనంతో, సహనంతో వుండాలి...
అంతటా ఈశ్వరున్నే చూడగలిగే స్థితిలో వుండగలగాలి...
మనం పరిపూర్ణమానవులుగా ఎదగాలంటే మనస్సుకు ఏ స్థితిలోనైనను ప్రేమ, దయ, ప్రశాంతత, సృజనాత్మకతతో వుండగలగడం నేర్పించాలి...
అదే నిజమైన భక్తి...

ఓం శివోహం... సర్వం శివమయం
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

Saturday, June 25, 2022

శివోహం

ప్రాణనాథ...
జగదీశ్వర...
భక్తవత్సల...
సదాశివ శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...