Thursday, June 30, 2022

శివోహం

శంభో...
సేవ చేయ కరుణించుము స్వామీ
నీకు పరిచర్యలు చేయ అంతర్యామీ...

చెంగుచెంగున చిందులు వేసే చిన్నతనము కుప్పిగెంతులతో గడిచింది...
కౌమారము పరి పరి విధముల పరిగెడినది... పరువము ముదిమిలో ముద్దుగా కీర్తించెద నీ నామము...

నీ సేవ చేయ కరుణించుము స్వామీ నీకు పరిచర్యలు చేయ...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఎదో ఒక శక్తి తనను కాపాడుతుంది అని నిజమైన భక్తుడికి తెలుస్తుంది...

అటువంటి నిజమైన భక్తుడి లో నే ఈశ్వరుడు కొలువై ఉంటాడు...

 ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, June 29, 2022

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు...

శ్రీ  సుందర చైతన్యానందులవారు.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శంభో...
చెదరని జ్ఞాపకాల దొంతరలు.
చేదు గురుతుల సమూహాలన్నీ నిను చేరుకునేందుకు సోఫానాలుగా మారాలన్నదే నా చిరకాల కోరక తండ్రి...
ఇక నీ దయ...

మహాదేవా శంభో శరణు...

Tuesday, June 28, 2022

శివోహం

జీవుడికి మరణం జననం లాంటివి ఉండవు...
పాత బట్టలు తొలగిస్తూ కొత్త బట్టలు ధరిస్తు
మరో జన్మ మరో తలిదండ్రులు మరో బంధనాలు
ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటాడు...
ఆది అంతు లేని  ప్రయాణం
గమ్యం తెలియని జీవనం
ఈ జీవుడి అనంతమైన యాత్ర
ఈ జీవాత్మ ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే ఎంత కాలమో కదా ఈ దేహ ధారణము

ఓం శివోహం... సర్వం శివమయం
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

Monday, June 27, 2022

శివోహం

ఈ చరాచర విశ్వాలన్నీ పంచభూతాల జనితమే.
ఈ సృష్టి యావత్తు పంచభూతాల సంయోగమే.

సృష్టికి ఆధారమైన పంచభూతములు మనలోనూ ఉన్నాయి.
ఈ పంచభూతాల సమ్మిళిత స్వరూపమే దేహం.
ఇక ఈ దేహమును చైతన్యవంతం చేయుటకు జీవశక్తి అవసరం.
ఆ జీవశక్తి కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే.

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...