Wednesday, July 13, 2022

శివోహం

భగవంతునితో బంధమే అనుబందం...
ఆ అనుబంధమే జీవునకు పరిపూర్ణ రక్ష...
ఆ భగవంతుడు జీవులందరి  హృదయమున విరాజిల్లుచున్నారు.
వాస్తవానికి ఏ  తత్త్వముచేత ఈ ప్రపంచము వ్యాపించి ఉన్నదో,మరియు ఏ  తత్త్వము నందు ఈ ప్రపంచము ఉన్నదో ఆ తత్త్వమే భగవంతుడు. ఆ భగవంతుడు అనన్య భక్తి  చేత , జ్ఞానవిచారణ వలన తెలియబడును. అపుడే జీవునకు పరిపూర్ణ రక్ష, పరమానందము కలుగును.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

అహం...
అహంకారం...
మొదటిది పారమార్ధికం
రెండవది ప్రాపంచికం....
అహం అంటే 'నేను' అని అర్ధం. 
ఆ అహం ఆకారంతో చేరితే అది అహంకారం.
యదార్ధ అస్తిత్వం 'నేను'. 
అపరిమితమైన 'నేను'ని పరిమితమైన మాయ ఉపాధికి చేర్చి చెప్పడం అహంకారం...

ఓం శివోహం సర్వం శివమయం

Monday, July 11, 2022

శివోహం

సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది...
దైవం (శివుడు) ఓంకార ప్రేమ స్వరూపం...
ఆయన రూప రహితుడు...
నాశన రహితుడు, నిర్గుణుడు...
ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు...
సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివుని పై నమ్మకం...
శివ భక్తులకు భక్తి లా..
పరభక్తులకు పిచ్చిలా కనిపిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, July 10, 2022

శివోహం

శంభో
నా అంతరంగపు ఊసులు అన్నీ ...
నీకే చెప్పుకుంటూంటాను ...

నువ్వు వింటున్నావో లేదోమరి ...
చెడుగాలి నా చుట్టూ ఆవరించివుంది ...

ఉబుసుపోక చెప్పుకునే మాటలకు మల్లే ...
నా అంతరంగాన్ని గాలికొదిలేయకు సుమా ....

నీ ముంగిట విచ్చుకున్న పూవు లా ఊపిరి విడవాలనుంది ...

మహాదేవా శంభో శరణు...

Saturday, July 9, 2022

శివోహం

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీహరి ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతుల్ని నింపాలని మీరు, మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లేలా, మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం వరించేలా దీవించాలని, శ్రీ మహా విష్ణువు కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం


శివోహం

నాన్న...
నాతో ఆడుకోవాటినికి నీనుండి నన్ను దూరం చేసి కలియుగంలో పంపి దాగుడు మూతలాడుతున్నావా తండ్రి...

పోనీ లే కలియుగంలో నీ పాదాలు దొరికినవి కదా అని సంబరపడుతుంటే బంధాల ఆశ చూపి , సంపదలు చూపించి ఆ బందం తో నన్ను బందీని చేసి ఇక్కడ కూడా నీ నుండి దూరమే చేస్తున్నావు...

ఎన్ని జన్మలైనదో ఈఆట మొదలుపెట్టి...
ముగుంపు నీయవా తండ్రి నీ సన్నిధిలో కాసింత చోటు నియ్యవా దేవా.

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...