Sunday, July 17, 2022

శివోహం

నిజం కాని మా బ్రతుకుని నిజమని భ్రమింప జేస్తావు..
ఆ భ్రమ లో ఓపిక ఉన్నంతకాలం తాపత్రయాల మధ్య ఊగిసలాటే ఈ జీవితం...
తీరా కనులు తెరిసాకా గడిచిన కాలం ఓపిక లేని శరీరం మాత్రమే మిగిలేది..

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద
నీ శిరసునుంచరాదా
కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా

ఓం శివోహం...సర్వం శివమయం.

Saturday, July 16, 2022

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది నీవే
అయ్యప్ప...
ఏమైతేనేమి, ఏదైతేనేమి, 
నా మనస్సు ను తృప్తి పరిచేది నీ కీర్తనలే ప్రభు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు.
మౌనంలోనే యదార్థం ఇవ్వడం, పుచ్చుకొనడం జరుగుతుంది
-మెహెర్‌ బాబా

శివోహం

భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా...
నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు...
అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం...

ఓం శివోహం... సర్వం శివమయం 

Friday, July 15, 2022

శివోహం

అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే 
ఈ బిడ్డనీకు కానరాలేదా 
ఒక్క నిముషమైన...
ఒకే ఒక్క నిముషమైనా....
నన్ను నీ ఒడిని చేర్చుకోమా...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి...

ఓం శ్రీమాత్రే నమః

Thursday, July 14, 2022

శివోహం

అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే 
ఈ బిడ్డనీకు కానరాలేదా 
ఒక్క నిముషమైన...
ఒకే ఒక్క నిముషమైనా....
నన్ను నీ ఒడిని చేర్చుకోమా...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...