Tuesday, July 19, 2022

శివోహం

శంభో...
మనసు కడిగే మార్గం జపమో...
ధ్యానమో? మౌనమో?
సత్యాన్వేషణానో ఎరుకలేని నాకు ఎరుకపరచవా...

నీగృహంలో నేనున్నాను దారిచూపవా పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
ఎన్ని జన్మల భాగ్యమో ఎన్ని పూజల ఫలమో కానీ...
శివోహం అనే ధ్యానం మరువనీకు...
ఈ నామం నా మరణం చేరు వరకు
ఆ నామమే ధ్యానమై శివమై శివంలో లయమై పోనీ...

మహాదేవా శంభో శరణు.

Monday, July 18, 2022

శివోహం

నా మీద...
నీ దయ ...
నిను చేరుటకై వేచి చూసే.
నన్ను ఇక నైనా  కరుణించు
నీ దయకై ఎదురు చూసే నీ..

మహాదేవా శంభో శరణు.

శివోహం

నీ చుట్టు ఉన్న బంధాల మోజులో పడి అదే లోకం అనుకోని శివుని బంధం ను వదులుకోకు మిత్రమా...
నీకు చివరకు ఈశ్వరుడు బంధం మాత్రమే...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, July 17, 2022

శివోహం

నిజం కాని మా బ్రతుకుని నిజమని భ్రమింప జేస్తావు..
ఆ భ్రమ లో ఓపిక ఉన్నంతకాలం తాపత్రయాల మధ్య ఊగిసలాటే ఈ జీవితం...
తీరా కనులు తెరిసాకా గడిచిన కాలం ఓపిక లేని శరీరం మాత్రమే మిగిలేది..

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద
నీ శిరసునుంచరాదా
కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా

ఓం శివోహం...సర్వం శివమయం.

Saturday, July 16, 2022

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది నీవే
అయ్యప్ప...
ఏమైతేనేమి, ఏదైతేనేమి, 
నా మనస్సు ను తృప్తి పరిచేది నీ కీర్తనలే ప్రభు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...