Thursday, August 11, 2022

శివోహం

నీకు వినబడే అంత గట్టిగా స్మరించలేను...
కానీ మౌనంగానే మాట్లాడతాను...
నా మనసులో ఉండి అంతా విను
వరం ఇచ్చినా ఇవ్వకపోయినా బాధలేదు కానీ
నీతో చెప్పి ఉంచితే సమయం వచ్చినప్పుడు నీవే రక్షిస్తావని...

మహాదేవా శంభో శరణు...

Tuesday, August 9, 2022

శివోహం

నిన్న ను మరిపిస్తావు...
నేటి నుంచి మురిపిస్తావు...
రేపటి రోజును గుర్తు చేస్తావు...
మూడు నామాల వాడవు...
నిన్న నేడు రేపుల నాధుడవు...
లోకాల నేలుతూ నన్ను కాచేవాడవు నీవే
పరమేశ్వరా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఇక్కడ నన్ను ఎందుకు వదిలి వెల్లవు నాన్నా...
ఈ బందాలు నేనే కోరివుంటాను ఇచ్చేసావు నీవు...
పసిపిల్లాడు అడిగితే హాలాహలం ఇవ్వవచ్చా తండ్రి...
36 సంవత్సరాలు గా నేను గుర్తుకు రాలేదా...
ప్రతిక్షణం నీ ధ్యాస తో గడుపుతున్న ఇంకా ఎన్నాళ్లు ఈ ఎడబాటు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నిన్న ను మరిపిస్తావు...
నేటి నుంచి మురిపిస్తావు...
రేపటి రోజును గుర్తు చేస్తావు...
మూడు నామాల వాడవు...
నిన్న నేడు రేపుల నాధుడవు...
లోకాల నేలుతూ నన్ను కాచేవాడవు నీవే
పరమేశ్వరా...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, August 8, 2022

శివోహం

భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం... 
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది... 
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే ఈశ్వరునికి నిజమైన శరణాగతి చేయగలడు... 
మాటిమాటికి ఈశ్వరుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు... 

ఓం శివోహం సర్వం శివమయం

Sunday, August 7, 2022

శివోహం

మొదటి ఒడి చేసుకున్న ఋణం...
రెండవ ఒడి తీర్చుకున్న ఋణం...

రెండు ఋణాల జమాఖర్చుల మధ్య నను నడిపే నాధుడు నా శివుడు...

శివ నాకు కూడా పిలుపు ఇవ్వు నీ సన్నిదే నాకు పరమావధి.

మహాదేవా శంభో శరణు.

Thursday, August 4, 2022

శివోహం

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు పెద్దలకు మిత్రులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు...

అందరికీ, ఆరోగ్యవృద్ధి, ఆర్థిక వృద్ధి కలగాలని
శ్రీ లక్ష్మీ మాత శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ.

సర్వేజనా సుఖినోభవంతు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...