మీ కుటుంబంలో చేర్చుకుంటావని...
నందిని చూసే దిశలో నీ వెనుకనే నిలుచుని ఉన్నాను శివ...
నన్ను నీ కుటుంబం చేర్చుకోవాలని సిఫార్సు చేయమని నందికి ప్రతిరోజు చెవిలో చెబుతున్నాను...
ఆర్తిగా నీ కుటుంబంలో ఓ మూల ఇంత చోటు ఇయవా తండ్రి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శంభో...
కష్ట మొచ్చినా
నష్ట మొచ్చినా
కన్నీరు దాచుకుని నవ్వుతూనే ఉంటా..
ఎందకంటే నువ్వు కనిపించిన రోజు నీకు అభిషేకం చేయడానికి కాసింత కన్నీళ్లు కావాలి కదా...
నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు శివ...
మహాదేవా శంభో శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...