Sunday, August 21, 2022

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప నిన్ను నమస్కరించు వారి
ఆపదలను పోగొట్టి రక్షించు...

శబరిగిరివాస పంచగిరి నివాస మణికంఠ దేవా నేను ఎల్లప్పుడూ నిన్నే స్తుతించుచుందును ఏ ఆపద వచ్చిన నా రక్షా నీదే తండ్రి....

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

Saturday, August 20, 2022

శివోహం

శివ నామం ను వినగానే ఆనందాశ్రువులు స్రవించనంత వరకే భక్తి సాధనలు అవసరం...

ఆ పరమేశ్వరుడి నామం విన్నంత వినగానే ఎవరికి కైతే ఆనందబాష్పాలు వెల్లివిరియునో,ఎవరి హృదయం ఉప్పొంగుతుందో అతడికి ఇక సాధనలు అనవసరం. 

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, August 19, 2022

ఓం

శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి

శివోహం

శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి

Thursday, August 18, 2022

శివోహం

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం తరుపున మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...

శివోహం

కాళేశ్వర ముక్తీశ్వర
శ్రీరామలింగేశ్వరా
నగరేశ్వర భీమేశ్వర
శ్రీరాజరాజేశ్వరా
బాలేశ్వర భువనేశ్వర
సోమసుందరేశ్వరా
ఈశ్వరా మహేశ్వరా
శ్రీకాళహస్తీశ్వరా
శంభో శంకరా
శివ శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

Wednesday, August 17, 2022

శివోహం

తండ్రి వలె దయగల మహారాజు...
ప్రథమ పూజ్యుడవు...
దివించవయ్య తండ్రి వలే...
మము ఆదరించి నీ తోడు నీడ అందించవయ్య గణేశా...

ఓం గం గణపతియే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...