శరీరమే కదిలించే రథము
రథానికి ఆత్మయే రధికుడు
రధికునకు సారధి బుద్ధి
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు
ఇంద్రియాలే కదిలే గుర్రాలు
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం
కళ్లెం అనేది జీవిలో మనస్సు
కర్మల వళ్ళ కలుగు ఫలం
ఫలం వళ్ళ పెరుగు భోగం
భోగం వళ్ళ కలుగు వాసన
వాసన వళ్ళ కలుగు జన్మ
జన్మ వాళ్ళ చేయాలి కర్మ
కర్మలే ఫల సుడి గుండాలు
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి
అంటే పరమాత్మ ధ్యానమే
అదే ఆత్మ జ్ఞానము
దీనికి లింగ బేధము లేదు
దీనికి నిత్యకర్మ నిష్ఠ
న్యాయ ధర్మ సత్యానికి శాంతి
No comments:
Post a Comment