Monday, August 29, 2022

శివోహం

శంభో...
నా దృష్టి మరల్చి ...
నిను మరచి...
నేనుండలేను...
ఉంటే నీతోనే నీలోనే...

మహదేవా శంభో శరణు.

Sunday, August 28, 2022

శివోహం

నీఇంట, నీవెంట, నీసందిట

నేనున్నప్పుడు,

అసంకిల్పితంగా ఎప్పుడైనా

ఎదురాడినానా ప్రభూ?


నీచెంత ఏచింత లేకుండా ఉంటూ

అనాలోచితంగా నోరుజారి

కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?


నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను

నా కలవరింతలలో నిన్ను కలతపరచే

కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?


నీకోసం సాగిన నా వెతుకులాటలో

నా సరసన నిన్ను గానక నిరసనతో

ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?


నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ

నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను

కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?


తెలియక, తెలివిలేక, తొందరతనంతో

నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?

మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?

నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను

కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?

అయిందా? నన్ను చేర్చుకో ..

లేదా ... నాతో ఉండు!


మహాదేవా శంభో శరణు. 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

సర్వేశ్వరా...... 
సర్వాంతర్యామి...... 
సర్వ జగద్రక్షకా..... 
సర్వ జగన్నాధా..... 

శివోహం....శివోహం.....

Saturday, August 27, 2022

శివోహం

అగ్ర పూజలు అందుకొనే అగ్రనాయక...
అఖిల గణాలకు నాయకుడా...
అఖిల జగములు నిన్నే పూజింప
మూషిక వాహనుడు నీవైతివి
కోరినవారికి వరాలిచ్చే శివుడు నీ కోసం మమ్ములను మరిచాడు...
నీవైన కరుణించవా కైలాసవాస తనయా.

ఓం గం గణపతియే నమః.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై మము రక్షించు..

శరణు శరణు శరణం మురుగా... 
శరణం శ్రీ బాలమురుగా..

శివోహం

శంభో నువ్వు కానిది ఏది..
నువ్వు లేనిది ఏది...
సర్వాంతర్యామి నువ్వు...
సర్వం సృష్టించినవాడవు...
కడు కష్ట మయినా, కడు దారిద్ర్యం అయినా నీ కన్ను పడితే కనుమరుగు కావాల్సిందే...
నీ కరుణ కోసం ఆరాట పడుతున్నాను.
సర్వ కాలమందు నా తోడుండగలవని ఆశిస్తున్నాను.

మహదేవా శంభో శరణు.

Friday, August 26, 2022

శివోహం

కంటినుండి ఎవడు చూచునో...
కన్ను ఎవరిని చూడలేదో...
చెవినుండి ఎవడు వినునో..
చెవి ఎవరిని వినలేదో...
మనస్సు నుండి ఎవడూహించునో...
మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో...
అతడే భగవంతుడు అతడే శివుడు...

ఓం శివోహం...సర్వం శివమయం.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...