Friday, September 9, 2022

శివోహం

మూలాధార దైవం సిద్ధి వినాయకుడిని స్మరించుకుంటూ అలాగే అన్న గారిని కార్తికేయ ను తలుచుకుంటూ...

సహస్రారం వరకూ ఓం నమఃశివాయ తో ప్రయాణం చేస్తూ...

అమ్మ ను దర్శనం చేసుకునే ప్రయత్నం అంతే...

ఆంత శివ మయమే కదా..

Thursday, September 8, 2022

శివోహం

దేహమను క్షేత్రంలో భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు ప్రేమ అను జలాభిషేకమును
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
ఓం శివోహం... సర్వం శివమయం.
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

శివోహం

*నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది,వెళ్తుంది.
బందువులు,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.

Wednesday, September 7, 2022

శివోహం

శంభో...
భౌతికమైన బంధాలన్నీ శాశ్వతం కాదని,
మొదలో,మధ్యలో,తుదలో 
వదిలి వెళ్ళిపోవాలని,వెళ్ళిపోతాయని
నీతో బంధం ఒక్కటే శాశ్వతమని తెలుసుకున్నా...
నీలో పుట్టి,నీతోడుగా పెరిగి,
నీలో చేరిపోయే నీ శిశువుని,
నువ్వే ఆలోచన,నువ్వే ఆచరణ
నువ్వే అంతా,నాబాట సరిచేసేది నీవంతు!
నీనామస్మరణ మాత్రమే నావంతు.

మహదేవా శంభో శరణు.

శివోహం

శంభో.
నీవుకూడా మాధవునిలా మాయలు చేస్తున్నావా ఎన్ని రూపాలలో ఉన్నావో ఎన్ని తావుల తిరుగుతావో ఎన్ని నామాల పిలువబడతావో ఎరుగకున్నాను...
బాహ్య ప్రపంచములో నీకై వెతికి వెతికి వేసారితిని కరుణించి కనికరించి నాలోనే నిన్ను దర్శించే భాగ్యాన్ని ప్రసాదించు...
జన్మ జన్మలలో నీకై పరితపించి అలసి పోతున్నాను ప్రేమతో వాత్సల్యంతో నాలోనే నిన్ను సేవించి తరించే మహాభాగ్యాన్ని వరంగా ఇవ్వు...

మహదేవా శంభో శరణు.

Tuesday, September 6, 2022

శివోహం

సంతోషపు సముద్రపు అంచున
ఆనందపు ఉశోదయాలు...

విషాదపు కొండల నడుమన
అస్తమిస్తున్న కష్టాలు.....

ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోజు గడిస్తే చాలని....

మరోమారు అనిపిస్తుంది ఇలాంటి రోజుల్లో ఉండకూడదని....

నిన్ను తెలియ గోరితే నిమిషంలో కరుణిస్తావంటగా...
నీ శరణు పొందితే చేయిపట్టి నడిపిస్తావంటగా...
సదా నిన్ను భజియిస్తే అమ్మగా లాలిస్తావటగా....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

ఈశ్వరా! నా మనస్సు ఒక పెద్ద దొంగ...
కట్టు తప్పుచున్న యీ దొంగను వైరాగ్యమనెడి త్రాళ్ళతో గట్టిగా బంధించి నీపాదములనెడి స్తంభములకు కట్టి పడవేసి వ్యామోహములు పోగొట్టి నన్ను ఆనందమును గలిగింపుము.

మహదేవా శంభో శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...