Saturday, October 1, 2022

శివోహం

భక్తి, అనురాగము, ప్రేమ, 
స్నేహము అన్నీ కలిపిన చనవుతో...
నా మనసును నీ పాదముల పై పేట్టి...
నాలో మహా దుఃఖాన్ని నీకు నీకు సమర్పిస్తున్నాను...
నన్ను బ్రోచేవాడవు నీవని నీ పై నమ్మకముంచినాను.....
నీ దాసాను దాసుడను...
మహాదేవా శంభో శరణు....

Friday, September 30, 2022

ఓం

ఇంట్లో ఉన్నా అమ్మకే ఎన్నో పనులు ఎన్నో రూపాలు మరి జగములను ఏలే జగదేక మాత నికెన్ని రుపాలో కదా తల్లి.

అమ్మ నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.

అమ్మ

ఇంట్లో ఉన్నా అమ్మకే ఎన్నో పనులు ఎన్నో రూపాలు మరి జగములను ఏలే జగదేక మాత నికెన్ని రుపాలో కదా తల్లి.

అమ్మ నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.

Thursday, September 29, 2022

శివోహం

అహం వల్ల ద్వేషం కలుగుతుంది...
ద్వేషం చాలా భారమైనది దాన్ని మీరు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ఆనందంగా ఉండగలరు...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో...
నా మనసు స్వేచ్చాపశువు గా తిరుగుతోంది దానికి నీ లీలల పాశంతో కట్టివుంచు...
నీ నామ సంకీర్తన అనే మేత వేసి నా ప్రతి రోజూ జన్మ సార్థకం తెలియచేయు...
నా యజమానినీవే అనే స్మరణ తేవయ్య శివ.

మహాదేవా శంభో శరణు.

Wednesday, September 28, 2022

శివోహం

శంభో...
ఈ ఆట చాలా కాలం ఆడాను...
ఇంకెంత కాలం ఆడతాను?...
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను....
ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను...
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు తండ్రి ఈ జన్మతో ఇక చాలు. 

మహాదేవా శంభో శరణు.

Tuesday, September 27, 2022

శివోహం

శంభో...
నేను చేసినా ఖర్మ ఫలం నా గుండె కోత కొస్తే....
నేను పలికే నీ నామా స్మరణ ముక్తి ఫలము నియ్యదా శివ...
ఖర్మపలం తెంచు నీ దారికి రప్పించు
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...