Tuesday, October 11, 2022

శివోహం

సమస్య లేకుండా జీవితం ఉంటుందా...
ఉండదు , కారణం జీవితమే సమస్య కాబట్టి...

ఓం నమః శివాయ.

Monday, October 10, 2022

శివోహం

శంభో!
నా నుదురుపై నీ నామములు మూడు...
నా మోపురముపై శ్రీ రామ రేఖలు మూడు...
మూడు మూడు ఆరు కోరికల అణచుదారి
చూపగలేవా చంద్రశేఖరా...
ఉడుతా భక్తిగ వందనములివే
అందుకొని ఆదుకోవయ్యా శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ, నీ అధ్యాత్మిక భక్తి ప్రపంచం లో ఏదో పొందాలని వచ్చిన నేను సర్వం పోగొట్టుకున్న...
ఇంకా మిగిలి ఉన్నది నేను...
నేను నీవు అయ్యేది ఎన్నడో ...   
ఓం నమః శివాయ

Sunday, October 9, 2022

శివోహం

భగవత్ సన్నిధికి చేరుకొనుటకు నామస్మరణ ఎంతటి ముఖ్యమో సేవలు కూడా అంతే ముఖ్యం. నామస్మరణ , సేవలు ఈ రెండూ రైలు పట్టాల వంటివి. కేవలం ఒక పట్టా మీదుగా పోతే రైలు తన గమ్యస్థానం చేరుతుందా?  రెండు పట్టాలు మీదుగా వెలితేనే గమ్యస్థానం చేరుకొగలదు. అదే విధముగా మనం భగవత్సన్నిధికి చేరుకోవాలంటే నామ స్మరణతో పాటు  సేవలు కూడా చేస్తుండాలి. అపుడే ప్రయాణం సులభమౌతుంది. శీఘ్రముగా భగవంతుని సన్నిధికి చేరుకొనుటకు అవకాశం ఉంటుంది.

ఓం శివోహం...సర్వం శివమయం.

Monday, October 3, 2022

శివోహం

లోకమాత,
వేదరూపిణి,
సకలలోకపావని,
సర్వసృష్టి స్థితి లయకారిణి.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు.

శివోహం

శివుడు ఒక శక్తి మాత్రమే కాదు అతడు మన వలెనే మంచి భావాలకు వెంటనే  ప్రతి స్పందించే వ్యక్తి కూడా.

ఓం నమః శివాయ.

Sunday, October 2, 2022

శివోహం

పరిస్థితులు చూసే వారికి ఒకలాగా అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తుంది.
అనుభవించే వారిని ఉన్నంత బాధా చూసే వారికి ఉండదు.

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...