Sunday, October 16, 2022

శివోహం

ఆకలి నిజమైతే ఆహారం దానికదే సమకూరుతుంది...
ఆర్తి నిజమైతే జ్ఞానం దానికదే సమకూరుతుంది...

ఓం నమః శివాయ

Friday, October 14, 2022

శివోహం

బాహ్యంలో నా నేను ఊరేగుతూ...
అంతరంలో నా నేను కు దూరమై...
ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు...
నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా..

మహాదేవా శంభో శరణు.

Thursday, October 13, 2022

shivoham

నేను భూలోకం నుండి కైలాసం కు వెళ్ళే వాడిని కాదు...
కైలాసం నుండి భూలోకం వచ్చిన వాడిని...
భూలోక యత్రికుడిని...            

ఓం నమః శివాయ

Wednesday, October 12, 2022

శివోహం

సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాఖిల్యులు, అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు.

శివోహం

గడిచిన క్షణం వరకు జరిగిందంతా దైవ సంకల్పమే...

ఓం నమః శివాయ.

Tuesday, October 11, 2022

అమ్మ

అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే ఈ బిడ్డనీకు కానరాలేదా...
ఒక్క నిమిషమయినా...
ఓకే ఒక్క నిముషమైనా నన్ను నీ ఒడిని చేర్చుకోమా...
అమ్మ లోకమాత శరణు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.

శివోహం

సమస్య లేకుండా జీవితం ఉంటుందా...
ఉండదు , కారణం జీవితమే సమస్య కాబట్టి...

ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...