Sunday, October 30, 2022

శివోహం

భగవంతుని సత్య సంకల్ప రూపం ప్రకృతి...
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, October 28, 2022

శివోహం

సకల ప్రాణికోటికి తల్లీవి కదా అమ్మ...
నీ బిడ్డల కళ్ళల్లో అశ్రువు లు స్రవిస్తే...
మాతృహృదయం కరిగి పోదా అమ్మ...
జర నువ్వైనా చెప్పమ్మా అయ్యతో...
ఆయన ఆడే ఆటను అడలేనని...
ఆటను ముగించమని నువ్వైనా చెప్పవమ్మా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి.

ఓం శివోహం... సర్వం శివమయం
ఓం శ్రీమాత్రే నమః.

Thursday, October 27, 2022

శివోహం

శంభో...
సూర్యునివలే ప్రకాశవంతంగా... 
చంద్రునివలే ప్రశాంతంగా... 
సంద్రంవలే జ్ఞానవంతంగా... 
పృథ్వివలే సహనంగా నన్ను నిలిపి...
ఈ బ్రతుకు పోరులో నను గెలిపించండి తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

Tuesday, October 25, 2022

శివోహం

శివ...
నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి...
దుఃఖాలు తొలగుతాయి...
లౌకిక సుఖములందు విరక్తులౌతారు...
జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు...
అందుకే నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు తండ్రి...
దానివల్ల కలిగే ఆనందనుభవంచే అలవికాని నా బాధలను మరిచిపోయి నీ పాదపద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవుడికి ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఈ జగత్తు ఈశ్వరుడి క్రీడా...
ఆయన ఆడే ఆటలో ఓడినావారెవరు ఉండరు గెలిచిన వారు అసలే ఉండరు...
ఎందుకంటే జీవుడే శివుడు కనుక.

ఓం నమః శివాయ.

Monday, October 24, 2022

శివోహం

మహాదేవా...
దేవా దయాపూర్ణభావా
నగేంద్రాత్మజా హృన్నివాసా
మహా దివ్య కైలాసవాసా
సదానంద విశ్వేశ్వరా
సర్వలోకేశ్వరా
సర్వయోగేశ్వరా
సర్వభూతేశ్వరా
నందివాహానా
భుజంగేశభూషా
త్రిశూలాయుధా
దేవదేవా మహదేవా శంభో శరణు.

Sunday, October 23, 2022

శివోహం

అష్టైశ్వర్యాల నెలవు...
ఆనందాల కొలువు..
సిరి సంపదలు...
సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...