Tuesday, December 20, 2022

శివోహం

నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి...
అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు...
ఈ దేహం నాది కాదు...
ఈ ఊపిరి నాది కాదు...
ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు...
అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి...
ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు...
నీ విధులు నువ్వు సాగించు...
నీకు కావలసినంత ప్రశాంతతా లభిస్తుంది...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం సర్వం శివమయం.

శివోహం

గతాన్ని తలచుకొని విలపించుట...
భవిష్యత్తును తలచుకొని భయపడి పోవడము వర్తమానములో నీకు శాంతి లేకుండా చేస్తాయి... కావున గతము గురించి ,భవష్యత్తు గురించి ఆలోచించుట మాని వర్తమానములో ఏమి చేయాలో ఆలోచించండి మిత్రమా...

ఓం నమః శివాయ.

Monday, December 19, 2022

శివోహం

మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది నేను అనే తలంపు...
ఇక రెండవది నాది అన్న తలంపు...
మొదటిది అహంకారం...
రెండవది మమకారం...
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం సర్వం శివమయం.

Sunday, December 18, 2022

శివోహం

నిన్నటిరోజు నీ ఆఙ్ఞతోనే గడిచింధి...
నేడు కూడా నీ అనుఙ్నతోనే నడుస్తుంధి...
రేపటిరోజు నీ ఆధీనంలోనే ఉంది...
ఋతువులు మారిన , గడియలు గడిచినా, నీ స్మరణను విడువని సంకల్పాన్ని స్థిరము చేయు భాద్యత నిదే...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓంశివోహం... సర్వం శివమయం .

శివోహం

అదేం చిత్రమో శివ...
కంటి తడి తుడిచేసినా
గాలి తిత్తుల తడి ఆరక
నా గుండె తల్లడిల్లి పోతుంది
నిన్ను చేరుకోవాలనే కోరిక కాబోలు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.

Saturday, December 17, 2022

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, December 16, 2022

గోవిందా

కోరి ఎలునట్టి   మా కులదైవమా...
మా పాపాలను తొలగించే పురుషోత్తమా
మాకు నిశ్చల భక్తి కలిగించే  బ్రహ్మతత్వమా...
శ్రీ శ్రీనివాస మా ఆశ అనే ఆకలిని తొల గించుమా.


ఓం నమో నారాయణ
ఓం నమో వెంకటేశయా నమః
ఓం నమో గోవిందయా నమః.
ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...