Saturday, December 24, 2022

శివోహం

శివా!నరునిగా నేను ఇలను పుట్టి
నలిగిపోతున్నాను నువ్వు నేనుల మధ్య
ఇది కాస్త ఎరిగించు నా భ్రాంతి తొలగించు
మహేశా . . . . . శరణు .

Friday, December 23, 2022

శివోహం

శివా!అథోముఖ పయనంబు ఎన్నాళ్ళు నాకు
ఊర్ధ ముఖ పయనానికి ఊతమీయవయ్యా
ఆ ఊతమే ఏతమై నన్ను నీ చెంత నిలుపగా
మహేశా . . . . . శరణు.

Thursday, December 22, 2022

శివోహం

పంచగిరి విహారుడు...
పానవట్ట బంధుడు...
కలియుగంబున జనులకు కల్పతరువు...
కోలిచినంతనె చాలును కోర్కెదిర్చి శుభము లిచ్చి కాపాడే జ్యోతిస్వరూపా
నన్ను దిద్దుకో...
సన్మార్గంలో
సద్బుద్ధితో
సద్భావనతో నన్ను నడిపించి...
తరింపజేసే భారం బాధ్యత నీదే...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం సర్వం శివమయం.

శివోహం

శివ....
ఇంద్రియసుఖములందలి ఆసక్తిని విడువలేకున్నా...
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నా...
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నా...
చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమయ్య 
మాలో తప్పులు తెలపవయ్యా శివ 
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకోవయ్య హర...
మహాదేవ శంభో శరణు

Wednesday, December 21, 2022

శివోహం

నిద్ర పట్టని వానికి రాత్రి  ఎక్కువ కాలంలా అనిపిస్తుంది...
అలసిన వానికి మైలు దూరము అనంతంలా అనిపిస్తుంది...
మంచిగా జీవించటము తెలియని వానికి జీవితము దుర్భరమనిపిస్తుంది...

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

పాదాలు పట్టుతప్పుతున్న పరమేశ్వరుణ్ణి గుండెలో జారనివ్వను...

ఒంటినిండా బట్టలేకున్నా నమ్మిన వాడిని విడవను...

శరీరం వదిలిన స్వధర్మం పట్ల అనురక్తి తగ్గించను...

కడుపు నిండకున్నా మనసారా మహేశ్వరుడిని కొలవడం మానను...

శివుడే నా సర్వం సర్వసం...
ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, December 20, 2022

శివోహం

నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి...
అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు...
ఈ దేహం నాది కాదు...
ఈ ఊపిరి నాది కాదు...
ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు...
అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి...
ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు...
నీ విధులు నువ్వు సాగించు...
నీకు కావలసినంత ప్రశాంతతా లభిస్తుంది...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...