Wednesday, December 28, 2022

శివోహం

శివా!నిను చేరు వారధి నెరిగించవయ్యా
యోగ్యుడైన సారధిని సమకూర్చవయ్యా
ఈ రథమున మనోరథము ఈడేర్చవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా శరణు!
పరమేశా శరణు!
మనసూ , శరీరమూ రెండూ ఈతి బాధలతో, సుఖాలతో( ఏవి సుఖాలో? ఏవి కష్టాలో? ) తడిసి అంతమయ్యే ముందు, నీమీద మా ధ్యానముండేలా మమ్ము అనుగ్రహించు స్వామీ!
అంతకు మించి ఏ కోరికలూ లేవు!
మహాదేవా శంభో శరణు!

Tuesday, December 27, 2022

శివోహం

ఎన్ని కష్టాలు కలిగిన
ఎంత దుఃఖము అనుభవించిన
ఎన్నెన్ని ఓటములు ఎదురైన
పట్టిన నీ పాదం విడువను కాకా విడువను...
ఈ దినమే కాదు నా ప్రతి దినం నీ సేవలో తరించడం కోసమే...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీకంటూ ఏమీ లేదు
నీది కానిది ఏదీ లేదు
నీకివ్వడానికి నాదేదీ లేదు
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రపంచంలో ఎవరి దగ్గరకు వెళ్లినా పూర్తిగా మనమే ప్రయాణించి వెళ్ళాలి...
ఒక్క భగవంతుడి మార్గం లో మాత్రమే సగం దూరం మనం వెళితే మిగతా సగం దూరం తానే ఎదురు వస్తాడు.
పూర్తి దూరం మనం ప్రయాణించాల్సిన అవసరం లేదు.

ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, December 26, 2022

శివోహం


శివా!చక్రాలులేని రథాన సంచరిస్తున్నావు
బేసి కళ్ళతో నీవు భాసించు చున్నావు
చక్రాలు ఉండి, సరి కళ్ళ నేనేమి సాధించలేకున్నా
మహేశా . . . . . శరణు .

Sunday, December 25, 2022

శివోహం

శివా!కరిపైన గిరిపైన ఎంత మక్కువో
కరి చర్మము దాల్చావు కరి వదనము కూర్ఛావు
గిరి తనయను కూడావు గిరి వాసము చేసావు
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...