Friday, December 30, 2022

శివోహం

శివా!విశ్వ వాణిగ వినిపించేవు
విశ్వ నేత్రమై వీక్షించేవు
విశ్వ చత్రమై వ్యాపించేవు
మహేశా . . . . . శరణు.
.

శివోహం

నీ సంకీర్తన లో నన్ను ఓడలాడించు..
ఆనందం ఎక్కడా అని వెదుకుతున్నాను...
నీ సన్నిధి అని తెలిసినా నా కనులు తెరవనందుకు క్షమించు ...
మహాదేవ శంభో శరణు.

Thursday, December 29, 2022

శివోహం

ఎన్ని జన్మల తపమో...
ఎన్నిజన్మల పుణ్య పలమో...
ఇరుముడు ఎత్తుకొని నిన్ను చేరి నీ దర్శన కోసం ఎదురు చూసిన ఆ జన్మ ధన్యుమే కదా మణికంఠ...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!రూపాలు నీకు ఎన్నున్నా 
అరూపరూపిగానే అగుపిస్తావు
ఆ మర్మమేమిటో నాకు ఎఱుకవ్వనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నీ రాతలు శిల రాతలు కావు మా తల రాతలు...
చెరగనివి మేమెరుగనివి...
సిధ్ధేశ్వరా నీ కరుణ  నాకిల  సిధ్ధించె అంతా నీదయ...
మహదేవ శంభో శరణు.

Wednesday, December 28, 2022

శివోహం

శివా!నిను చేరు వారధి నెరిగించవయ్యా
యోగ్యుడైన సారధిని సమకూర్చవయ్యా
ఈ రథమున మనోరథము ఈడేర్చవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

సప్తస్వర నాదవినోదిని...
సౌభాగ్య సమేత సుద్రుపిని..
అఘనాషిని...
నిటలాక్షిని...
సర్వాలంకార సుశోభిత మంగళా 
కరిరాజ, రాజేశ్వరి...
అనవరతంబు నీ సేవలోనరించు  భాగ్యము 
కలిగించు జగదీశ్వరి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి...
అమ్మ దుర్గమ్మ శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...