Thursday, January 5, 2023

శివోహం

శివా!ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావు
అంతులేని ఆకాశాన అమరి ఉన్నావు
ఇంత వైవిధ్య ఎటులనో విశ్వనాథా
మహేశా . . . . . శరణు .

Wednesday, January 4, 2023

శివోహం

శివా!గత జన్మ గురుతుకు రాదు
మరు జన్మ తెలియగ రాదు
తెలిసి తెలియని ఈ జన్మలెన్నాళ్ళు
మహేశా . . . . . శరణు .

శివోహం

తొలి మెట్టు జ్ఞానం...
మలి మెట్టు భక్తి...
చివరి మెట్టు వైరాగ్యం...
జ్ఞాన, భక్తి, వైరాగ్యము లు మెట్లు అయ్యాక...
నీ పంచన చోటు దొరక్కపోతుందా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, January 3, 2023

శివోహం

మణికంఠ దేవా...
తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు... 
నాపై నీ అంతరంగమున ఏమున్నా నేను నీ బిడ్డడను... 
నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... 

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

జీవాత్మ ఒక శరీరములో ప్రవేశించినప్పుడు జననము...
మరల ఆ శరీరమును విడిపోయినప్పుడు మరణము సంభవించును...
జనన మరణములు శరీరములకే వర్తించును కానీ జీవాత్మకు జనన మరణములు లేవు...
మానవుడు ఎట్లు చిరిగిన వస్త్రములను వీడి నూతన వస్త్రములను ధరించునో అట్లే జీవాత్మ శిథిల దేహములను వీడి నూతన దేహములను ధరించును.

ఓం శివోహం...సర్వం శివమయం.

Monday, January 2, 2023

శివోహం

శివ...
నా జన్మకు కారకుడవు నీవు..
దుర్భమైన మానవ జన్మనిచ్చావు..
అందునా విద్యను పొందేలా అర్హత
మీదుమిక్కిలి నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో
నడిపిస్తున్నావు...
విశేషంగా నన్ను "శివారాధకుడిని" చేసావు...
ఇంతకన్న ఇంకేమి కావాలి పరమేశ్వర...
నీవు నాతండ్రివి నిను మరువను 
అయ్యప్ప రూపంలో , మణికంఠ నామం తో రోజూ స్మరించుకుంటున్నాను...

మహాదేవ శంభో శరణు.

శివోహం

శివ...
నా జన్మకు కారకుడవు నీవు..
దుర్భమైన మానవ జన్మనిచ్చావు..
అందునా విద్యను పొందేలా అర్హత
మీదుమిక్కిలి నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో
నడిపిస్తున్నావు...
విశేషంగా నన్ను "శివారాధకుడిని" చేసావు...
ఇంతకన్న ఇంకేమి కావాలి పరమేశ్వర...
నీవు నాతండ్రివి నిను మరువను 
అయ్యప్ప రూపంలో , మణికంఠ నామం తో రోజూ స్మరించుకుంటున్నాను...

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...