Saturday, January 7, 2023

శివోహం

ఆరాధన అనేది అద్భుతమైన...
అందమైన మధుర భావం....
అది త్రిగుణా తీతం
అలౌకిక ఆనంద భరితం...
అనుభవైక వేద్యం కూడా...

ఓం శివోహం... సర్వం శివమాయం
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివా!ముంచేయగ గంగమ్మ మీద పడుతుంటే
తృంచేసి మార్గాన్ని కొప్పునుంచావు
ఒడిసి పట్టుట నీకే ఒప్పునయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కుప్పల తెప్పలుగ కథలు కూడుతున్నాయి
సశేషాల కథలు ఇంక చాలునయ్యా  
సమాప్తమనిపించు కథను కంచికి నడిపించు
మహేశా . . . . . శరణు .

Friday, January 6, 2023

శివోహం

ఇలలో వెలసిన కైలాసనాథుడు...
శివ శివ అనగానే చింతలు తీర్చే సర్వేశ్వరుడు...
హరహర అనగానే ఆపదలు తొలగించే మహాదేవుడు...
ఆదిశక్తి తో లోకాలు కాచే లోకేశ్వరుడు...
శరణంటే చాలు కరుణించే బోళాశంకరుడిని నిత్యం శరణు వేడుదాం.. 

మహాదేవా శంభో శరణు...

Thursday, January 5, 2023

శివోహం

అమ్మ చాటు బిడ్డవయ్యా
అగ్ర పూజలు అందుకొనే
అఖిల గణాలకు నాయకుడిగా!
అఖిల జగములు నిన్నే పూజింప
మూషిక వాహనుడు నీవైతివి
కోరినవారికి వరాలిచ్చే శివయ్య!
నీ కోసం మమ్ములను మరిచాడు
నీవైన కరుణించవా
కైలాసవాస తనయా జై గణేశా!!

శివోహం

శివా!ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావు
అంతులేని ఆకాశాన అమరి ఉన్నావు
ఇంత వైవిధ్య ఎటులనో విశ్వనాథా
మహేశా . . . . . శరణు .

Wednesday, January 4, 2023

శివోహం

శివా!గత జన్మ గురుతుకు రాదు
మరు జన్మ తెలియగ రాదు
తెలిసి తెలియని ఈ జన్మలెన్నాళ్ళు
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...