Wednesday, January 11, 2023

శివోహం

నీకై పిలిచి పిలిచి నా స్వరము  తరిగి
పోయినదిరా పమేశ్వరా...
నాకై  నీవు  పిలువగా...
నీ  స్వరము  వినాలని మది...
ఎదురుచూపురా ఈశ్వరా ఇది...

మహాదేవా శంభో శరణు.

Tuesday, January 10, 2023

శివోహం

కండ్ల ఆర్తి కన్నీరై ఇంకి అవిరైందని...
నిన్ను అభిషేకం కు నీరేమీ లేదని చూడకు శివా...
నా హృదయ వేదన జలం తోడితే సాగరం కూడా చిన్నపోతుంది...

మహాదేవ శంభో శరణు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు

కఠిన దుఃఖ బాధలైనా...
గుండెల్లో ఊపిరి భరువైనా...
స్థితి గతులే మారినా...
నీ ఆరాధన ఆపను...
నీ ధ్యానం అపను...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!మారుతున్న జగతిలో మసలుచున్న నేను
మారని నిన్ను చేర ముడుపు మూట కట్టినాను 
ముడుపు నాకు చెల్లనీ మూటనీకు ముట్టనీ
మహేశా . . . . . శరణు.

శివోహం

భగవన్నామంతో  దివ్యాను భూతి  పొందవచ్చు...
భక్తి అనే ఆయుధముతో పరమాత్మను చేరవచ్చు...
నావ లేకుండా సంసార సముద్రాన్ని దాటవచ్చు...
భక్తి అనే బీజం వృక్షమై సుఘంధం వేదజల్లవచ్చు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, January 9, 2023

శివోహం

శివా!అన్నీ చూడ అడ్డుకనులకే సాధ్యం
నిన్ను చూడ నిలువు కన్నుకే సాధ్యం
నిలువుకన్ను తెరిచి నిన్ను చూచేలా చూడు
మహేశా  . . . . . శరణు

Sunday, January 8, 2023

శివోహం

అయ్యప్ప! నా పంచ ప్రాణములను
పంచామృతములుగా చేసి
ఆభిషేకించ వచ్చితి ఆనతిమ్ము
మహేశా . . . . .  శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...