Wednesday, January 11, 2023

శివోహం

శభరీశ్వర...
పాశాంకుశ ధారి....
పాపధ్వంసకం ధారి....
భవబంధ మోచక ధారి.....
నా మదిని భక్తి తో కరిగించి నీకు కర్పూర హారతిగా అర్పింతును...
నా శరీరం అనే నారికేళం లో అహం అనే నెయ్యి నింపి నీ కొండకు వస్తా...
న అహం ను తొలిగించు నీ ముక్తి మార్గం చూపించు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శివా!ఇష్టమూర్తిగ నిన్ను కొలిచి
అష్టమూర్తిగ నిన్ను తెలిసి
కష్ట సఖములన్నీ నీకే అర్పిస్తున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

నీకై పిలిచి పిలిచి నా స్వరము  తరిగి
పోయినదిరా పమేశ్వరా...
నాకై  నీవు  పిలువగా...
నీ  స్వరము  వినాలని మది...
ఎదురుచూపురా ఈశ్వరా ఇది...

మహాదేవా శంభో శరణు.

Tuesday, January 10, 2023

శివోహం

కండ్ల ఆర్తి కన్నీరై ఇంకి అవిరైందని...
నిన్ను అభిషేకం కు నీరేమీ లేదని చూడకు శివా...
నా హృదయ వేదన జలం తోడితే సాగరం కూడా చిన్నపోతుంది...

మహాదేవ శంభో శరణు...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు

కఠిన దుఃఖ బాధలైనా...
గుండెల్లో ఊపిరి భరువైనా...
స్థితి గతులే మారినా...
నీ ఆరాధన ఆపను...
నీ ధ్యానం అపను...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!మారుతున్న జగతిలో మసలుచున్న నేను
మారని నిన్ను చేర ముడుపు మూట కట్టినాను 
ముడుపు నాకు చెల్లనీ మూటనీకు ముట్టనీ
మహేశా . . . . . శరణు.

శివోహం

భగవన్నామంతో  దివ్యాను భూతి  పొందవచ్చు...
భక్తి అనే ఆయుధముతో పరమాత్మను చేరవచ్చు...
నావ లేకుండా సంసార సముద్రాన్ని దాటవచ్చు...
భక్తి అనే బీజం వృక్షమై సుఘంధం వేదజల్లవచ్చు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.