Friday, January 13, 2023

శివోహం

శివా!జనన మరణాల జరీమానాలు 
సుంకాల చెల్లింపులు  ఇంక చెల్లిపోనీ
టంకమేసి నీ సన్నిధి నిలిచిపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

అలజడి అశాంతి లేకుండా నిశ్చలంగా ఉన్న మన స్సే అమృతత్త్వము...
అదే తపస్సు...
దీనినే మోక్షమని అంటారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, January 12, 2023

శివోహం

అమ్మ స్వర్గం అయితే...
నాన్న సింహద్వారం...
నాకోసం తలపుదగ్గర నిలిచి...
నా తలపులలోకి వచ్చావా శివా...
నీ దీవెనలుంటే నా జీవితం నీదే అవుతుంది...
మహాదేవా శంభో శరణు...

హరిహారపుత్ర అయ్యప్ప

హరి హారపుత్ర...
అయ్యప్ప...
జగదీశ్వర... 
సన్మార్గం చూపు...
సద్గతి ని అనుగ్రహించు...
సద్భావన ను ప్రసాదించు...
తండ్రీ, నీవే గురుడవు,దైవానికి ,తల్లివి, తండ్రివి, సర్వం నీవే,నన్ను బ్రోచి రక్షించే భారం నీదే...
పరమాత్మా...
పరందామా...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు
పరమేశ్వరా శరణు..

శివోహం

శివా!వెలుగులో విచ్చుకున్న అజ్ఞానం తొలగనీ
చీకట్లో వెలుగుచున్న జ్ఞాన దీపిక  మిగలనీ
చిరకాలపు నా కోరిక తీరిన కదా వేడుక
మహేశా . . . . . శరణు.

శివోహం

'కట్టె' కాలేంత వరకే కదా శివ...
ఈ కష్టాలు - సుఖాలు...
ఆస్తులు - ఆప్తులు...
మరి ఈ భవబంధల గోల నాకెలా...

మహదేవ శంభో శరణు.

Wednesday, January 11, 2023

శివోహం

నా కోరికాలకు కొంగుముడి వేసి ని కొలువు నుండి దూరం చేయకు తండ్రి...

నాలో ఆశలు కల్పించి అందలాలు ఎక్కించి నిన్ను మరిచేలా చేయకు...

నిన్ను విడిచి నే ఉండలేను....

శివ ని దయ తండ్రి...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.