Monday, January 16, 2023

శివోహం

మహేశా పాప వినాశ...
కైలాస వాసా...
ఈశా నిన్నే నమ్మి నాను దేవా
నీల కంధర దేవ...
మహాదేవ అంటేనే చాలు...
కరుణించి బ్రోచే దేవర...
శరణంటే మరవక వచ్చి...
రక్షించే విభుడ వు నీవే...
సర్వ రోగ భవ భయ హర్తవు నీవే...
సకల లోక పాలన కర్తవు నీవు...
నీవే శరణు...
మహాదేవ శంభో శరణు.

Sunday, January 15, 2023

శివోహం

ఈ తనువు గతమెన్నో జన్మలనుండి నీ వెంట పడినా...
ఈ జన్మములో నీవెవరివో అర్ధమయింది...
అందుకే ఆతురత నిన్ను కలవాలని...
నీతో ఉండిపోవాలని, నీ పంచన నిలవాలని...
మనసు  తహతహలాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

శివోహం

బాహ్యప్రంపచంలో ఉండే వస్తువులు తమంతతాముగా మనకు దుఃఖాన్ని ప్రసాదించవు... ఆ వస్తువుపై మనకుండే కోరికలే వాటికి శక్తి నిస్తున్నాయి...

ఆ శక్తితో అవి మనలను బంధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, బానిసలుగా మారుస్తున్నాయి...

ఈ కోరికలు నశిస్తే మనస్సు ఉద్రేకాలకు బాధలకు భయాలకు లోనుగాకుండా శాంతంగా హాయిగా ఉంటుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, January 14, 2023

శివోహం

ఆత్మీయ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ సంవత్సరంలోని మొదటి పండుగ మీకందరికీ ఎన్నో విజయాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ..
ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలి మనసారా కోరుకుంటూ...

సర్వేజనా సుఖినో భవంతు...
లోకా సమస్తా సుఖినో భవంతు.

శివోహం

బాట అంటే రాళ్లు రప్పలతో కూడి ఉన్నట్టే జీవితమంటే ఎత్తుపల్లాలే అని అర్ధం చేసుకున్న  శ్రమ జీవులకు తలపై మోతలు గుండెల్లో బరువు ఒక లెక్కా...

అందుకే కాబోలు ఈ బ్రతుకు చిత్రాల  నవ్వులెప్పుడూ సజీవాలే...

జీవితం అంటే  లక్షలు, కోట్లు సంపాదించడం ఒక్కటే  కాదు...

మన మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో అక్కడ గడపటం...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, January 13, 2023

శివోహం

శివా!జనన మరణాల జరీమానాలు 
సుంకాల చెల్లింపులు  ఇంక చెల్లిపోనీ
టంకమేసి నీ సన్నిధి నిలిచిపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

అలజడి అశాంతి లేకుండా నిశ్చలంగా ఉన్న మన స్సే అమృతత్త్వము...
అదే తపస్సు...
దీనినే మోక్షమని అంటారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...