Wednesday, January 18, 2023

శివోహం

నా వేదనను ఇద్దరు మాత్రమే అర్థం చేసికోగలరు...
నా అద్దంలో కనిపించే వ్యక్తి ఒకరు...
మరొకరు నేను...

ఓం నమః శివాయ.

శివోహం

విశ్వమంతా వ్యాపించి ఉన్నావు...
అంతటా నీవు కాకా మరొకరు ఎలా
కనిపిస్తారు శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!నన్ను చూసి పిచ్చివాడని నవ్వుకోకు
నాకు పట్టుకుంది  నీ పిచ్చే వేరనుకోకు
ఆ పిచ్చి ముదిరిపోనీ నీ చిచ్చు రగిలిపోనీ
మహేశా  .  .  .  .  .  శరణు  .

శివోహం

శివ...
అన్నింటికీ కర్తవు నీవే కదా అన్ని నీవే చేస్తావు కదా...
నడవడం చేతకాక తప్పటడుగులు వేస్తున్న నన్ను పట్టుకొని  నీవే తీసుకో...
మనస్సుకు పూర్వజన్మల వారసత్వయంగా సంక్రమించిన వాసనల నుండి నన్ను నీవే విడుదల చేయాలి 
ప్రాపంచిక విషయాల్లో విజృంభిస్తున్న నా మదిని నిలువరించి నిరంతరం నీ నామస్మరణం నాలో ఉండేట్టు తర్పీదు ఇవ్వాలి
సదా నీ చరణాల వద్ద నా బుద్ది స్థిరంగా ఉండేటట్టు నీవే చూసుకో...

మహదేవా శంభో శరణు. 
                                       *మోహన్ వి నాయక్*

Tuesday, January 17, 2023

శివోహం

నువ్వు నాలో ఉన్ననాళ్ళు...
నా గుండెలో నీ నామం...
ఓంకార నాదమై మొగుతూనే ఉంటుంది తండ్రి...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు....
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఉపాదులన్నిటా నీ మెరుపు వున్నట్టు
లింగరూపాన నంది మోపురం మెరిసె
ఇది నీ సృష్టి చిత్రమే చిత్త భవుడా
మహేశా . . . . . శరణు .

శివోహం

జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన ఈ లోకంలో జీవునికి సుఖ సంతోషాలెక్కడివి?...
ఒక్క పరమేశ్వర శరణాగతి లో తప్ప ఎక్కడా ఆనందం కనిపించదు...
ఒంటరిగా లోకంలోకి ప్రవేశించిన మనిషికి ఎవ్వరితోటి సంబంధం కలదు?...
మాయా జగన్నాటకం లో బూటకపు సంబంధాలతో వాదులాటలెందుకు? కొట్లాటలెందుకు? మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.