Monday, February 6, 2023

శివోహం

నీలకందర దేవా.....
దీనబంధవా.....
శంభో సదాశివా.....
అన్యదైవమూ కొలువా.... 
నీదు పాదమూ విడువా..... 

మహేశా శరణు శరణు....

Sunday, February 5, 2023

శివోహం

See Good
Say Good
Do Good
ఈ మూడూ చాలు పరమేశ్వరా
మనసా వాచా కర్మణా నిన్ను అనుసరించే దారి చూపించు...

మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!పూర్వ జన్మ పలితాలు పూర్తి కాగా
ఈ జన్మ శేషాలు మిగలినీయక
ముగిసిపోనీ ఈ జన్మ జాడ్యం.
మహేశా . . . . . శరణు .

శివోహం

ఒకరు జీవించాలంటే మరొకరు చనిపోవాలి.
ఆటగదరా శివ... ఆటగద కేశవ...
ఆటగదరా శివ ఆటగద కేశవ
ఆటగదరా నీకు అమ్మతోడు
ఆటగదరా శివ... ఆటగద కేశవ...
ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలొ ప్రణయాలు ఆటగద నీకు...
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు..

శివోహం

సంసారం నుండి, సృష్టి నుండి, ఈశ్వరుడు నుండి సహాయం పొందాలంటే ముందుగా స్వార్థం, మోహము త్యాగం చేసి, జీవితంతో సంఘర్షణ చేయాల్సి వుంటుంది.

If you wish to Get real Help from World, Nature, and Lord Eeswara you need to Sacrifice Selfishness and Attachment and fight for it in life.

Saturday, February 4, 2023

గణేశా శరణు.

భగవంతుని ప్రేమికులు ఏ కులానికో మతానికో చెందినవారు కారు.
భగవంతుడు చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు...
ఆ పరమాత్ముడే సత్యం ,సనాతనం...
అతని ప్రేమైక సృజనయే సృష్టి...
దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై బాసిల్లుతుంది...

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

త్రిగుణాలకు నీవు అతీతుడవు...
సర్వెంద్రియాలు నీమెద పనిచేయవు...
భక్తికి లొంగి సహయము చేసేవాడవు...
మా బుద్ధిని మార్చేవాడవు నీవు...
నీవే శరణు...
మహదేవా శంభో శరణు.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...