Wednesday, February 8, 2023

శివోహం

శంభో...
నా బాధలో నీడవి నీవు
నా సంతోషంలో తోడువు నీవు
నా కష్టంలో భాగం నీవు
నా ఇష్టంలో భావం నీవు
నా మనసులో రూపం నీవు
నాలో మౌనం నీవు
నాలో శ్వాసే నీవు
నా హృదిలో వెలుగే నీవు
నా పయనం నీ పదసన్నిథికే
నన్ను దరిజేర్చుకొనేదీ నీవే
నా ఆరాధ్యదైవం నీవే

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!స్థూలంగా నేను , సూక్ష్మంగా నీవు
సూక్ష్మంలో స్థూలం,స్థూలంలో సూక్షం
నీ లీలా వినోదం కలిగించును మోదం
మహేశా . . . . . శరణు .

Tuesday, February 7, 2023

శివోహం

హరిహరపుత్ర అయ్యప్ప...
నోరు నీ నామ స్మరణ చేస్తుంది...
బుద్ది బురదలో నాట్య మాడుతుంది...
నా మనసు అనే సామ్రాజ్యం కు అధిపతి నీవు...
కోరికల గుర్రాలకు కళ్ళం వేసి నీ సన్నిధిలో కట్టిపడేయవా మణికంఠ.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

సదాశివుడే
సదా తోడుగా ఉంటాడు మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఓ కన్నైనా నిను చూడాలని
కలకాలం నీలోనే కలిసుండాలని
కర్మిస్తున్నా నన్ను కనలేవా. . . . .
మహేశా . . . . . శరణు .

Monday, February 6, 2023

శివోహం

శివా!నిశ్చయంగా  నిశ్చలుడవు
అందరికీ ఆంతరంగికుడవు
మరి ఎంతో విలక్షణుడవు
మహేశా . . . . . శరణు .

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు... జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి...
అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు...
జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు....
పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...