Tuesday, February 28, 2023

శివోహం

శివా!నీకు చేరువ కావాలని
నీ చెంతకు చేరాను
నీలో చేర్చుకో నీవుగా మలచుకో
మహేశా . . . . . శరణు .

శివోహం

మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది.

Monday, February 27, 2023

శివోహం

శివా!నిన్ను తెలియుటకన్న  వైరాగ్యమేది
నిన్ను చేరుటకన్న వైభవం ఏది
వైరాగ్యం విరియనీ ఆ వైభవం పొందనీ
మహేశా . . . . . శరణు .

Sunday, February 26, 2023

శివోహం

నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది...

నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు, విజయ శిఖరాలను అధి రోహింప జేస్తుంది.

ఓం నమః శివాయ.

శివోహం

శివా!నెలవంక రూపాన సిగలోని పూవుగా
సోమ నేత్రము కాస్త చిదిమి పెట్టావా
అమృతమే కురిపించె అహర్నిశము .
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల
నేను లేకపోతే ఏమవుతుందో
అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 
'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 
*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 
అతి చిన్నవాడను* 
అని ఎఱుక కలిగి ఉందాం.

ఓం శివోహం...సర్వం శివమయం.

Saturday, February 25, 2023

మంచిమాట

మిత్రమా...
వంద మంది వంద రకాలుగా చెప్తారు.
అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు.
నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి.
ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు.
ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...