Sunday, March 26, 2023

శివోహం

జీవితంలో ఎన్నింటినో దాటుకుని...
ఎన్నింటినో పోరాడి తెచ్చుకొని...
ఎన్నింటికోసమో ఆరాటపడి...
జీవితం మొత్తం అనుక్షణం...
జీవించడానికే ఆశపడుతూ...
చివరికి పిడికెడు మట్టిగానో...
పిడికెడు బుడిదగానో మారడానికే మన ఆరాటం పోరాటం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, March 25, 2023

శివోహం

శివా!రేయెండ రెక్కను తీసి
పూదండగ సిగలో పెట్టి
శాపానికి శాంతి నొసగేవు .
మహేశా . . . . . శరణు .

శివోహం

మధురమైన పదార్థం నాలుకకు కొంత సేపే తీపి దనాన్ని అందివ్వ గలదు.
శ్రావ్యమైన సంగీతం చెవులకు కొంతవరకే అస్వాదన కలిగించ గలదు.
చిత్రమైన దృశ్యాలు కళ్ళకు లిప్త కాలం మాత్రం మనో రంజనం చేయవచ్చు.
కానీ...
మనసుతో చేసే శివ స్మరణ మనిషికి ఆసాంతం అవధులు లేని ఆనందాన్ని, ముగ్ధ మనోహర మైన మనో రంజనాన్ని అందిస్తుంది.
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, March 24, 2023

శివోహం

మంచిమాట

అజ్ఞానం వల్ల చెడి పోతారు కొందరు, ప్రమాదవశాన చెడి పోతారు ఇంకొందరు.

తామే తెలివి గల వాళ్ళం అనే గర్వంతో చెడి పోతారు మరికొందరు.

చెడి పోయిన వాళ్ళ చేతుల్లో పడి చెడి పోతారు ఇంకొందరు.

Thursday, March 23, 2023

శివోహం

శివా!గుండెల్లో ఉన్న నిన్ను గుడిలో చూస్తున్నా
గుడిలో ఉన్న నిన్ను గుండెల్లో చూడనీ
గుండె గుడిగా తెలియనీ తెలివి తేటపడనీ
మహేశా ..... శరణు.

Tuesday, March 21, 2023

శివోహం

శివా!తోడు లేని నీవే మాకు తోడైనావు
నీడ లేని నీవే మాకు నీడైనావు
మా తోడు నీడ నీవేనని తెలియ జేసినావు.
మహేశా . . . . . శరణు .

Monday, March 20, 2023

శివోహం

శివా!సగం నీవని అనుకున్నాను
సర్వం నీవని వింటున్నాను
విదితమవనీ విషయమంతా.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...